English | Telugu

ప్రియామణి, విమలా రామన్ లతో సుమంత్ లిప్ లాక్

ప్రియామణి, విమలా రామన్, సుమంత్ లిప్ లాక్ సీన్లలో నటించారట. సుమంత్ హీరోగా, ప్రియమణి, విమలా రామన్ హీరోయిన్లుగా, వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో, కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న "రాజ్" చిత్రంలో హీరో సుమంత్, ప్రియమణి, అలాగే సుమంత్ విమలా రామన్ కూడా లిప్ లాక్ ముద్దు సీన్లలో నటించారట. ఈ ముద్దు సీన్లలో వాళ్ళు ముగ్గురూ వొళ్ళు మరచిన తన్మయత్వంతో నటించారని, ఇంకా చెప్పాలంటే ఆ ముద్దు సీన్లలో జీవించేశారని ఈ చిత్రం యూనిట్ చెపుతోంది. ఈ "రాజ్" సినిమాలో కథ, కథనం, దర్శకత్వం ఎలా ఉన్నా ఈ ముద్దుల సీన్లు యువతను బాగా ఆకర్షిస్తాయని ఈ చిత్ర నిర్మాతలు బలంగా నమ్ముతున్నారట.

ఈ ముద్దు సీన్లు తెలుగు సినిమాల్లో నాగార్జున "గీతాంజలి" సినిమాతో ప్రారంభమయ్యాయి. ఈ మధ్య అల్లు అర్జున్, నాగచైతన్యలతో పాటు సుమంత్ కూడా ఈ లిప్ లాక్ సీన్లలో చాలా ఉత్సాహంగా నటించాడు. సుమంత్ హీరోగా, ప్రియమణి, విమలా రామన్ హీరోయిన్లుగా, వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో, కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్నఈ "రాజ్" చిత్రం మార్చ్ 18 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం