English | Telugu
మెగాస్టార్ కుమార్తె శ్రీజ భర్త మీద వరకట్నం కేసు
Updated : Mar 15, 2011
నిన్న అంటే మార్చ్ 14 వ తేదీన, మెగాస్టార్ కుమార్తె శ్రీజ తన భర్త తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడని సి సి యస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయాన్ని ముందుగా లైట్ గా తీసుకున్నారు. కానీ మెగాస్టార్ కుమార్తె శ్రీజ ఒక సీల్డ్ పోలీసులకు అందజేసినట్లు తెలిసింది. ఆ సీల్డ్ కవర్ లో ఏముందనేది ఇంకా తెలియలేదు. ఈ వార్త రాత్రి 8 గంటల వరకూ శాటిలైట్ ఛానల్స్ లో మారుమ్రోగినా, 9 గంటల తర్వాత ఎందుకనో అన్ని ఛానల్స్ ఒక్కసారిగా ఈ వార్తను ఆపేశాయి. మెగాస్టార్ తరపున అలా ఈ వార్త ప్రచారం కాకుండా మేనేజ్ చేసి ఉంటారని సినీజనం అంటున్నారు. ఏది ఏమైనా వరకట్నం వేధింపుల సమస్య అనేది సాధారణ ఆడపిల్లకైనా, మెగాస్టార్ కూతురుకైనా సమానమేనని ఈ సంఘటనతో మరో సారి రుజువయ్యింది.