English | Telugu

ప్రేమ కావాలి 75 సెంటర్లలో 50 రోజులు

"ప్రేమ కావాలి" 75 సెంటర్లలో 50 రోజులు ఆడింది. ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తూ, కె.విజయభాస్కర్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మించిన యూత్ ఫుల్ ప్రేమకథా చిత్రం "ప్రేమ కావాలి". ఈ "ప్రేమ కావాలి" చిత్రం విడుదలై ఇటీవల అర్థశతదినోత్సవం పూర్తి చేసుకుంది. అది కూడా ఒక కొత్త హీరో సినిమా 75 సెంతర్లలో 50 రోజులు పూర్తిచేసుకోవటమంటే మామూలు విషయం కాదు.

అసలు ఒక సినిమా నాలుగు వారాలాడితేనే "మా సినిమా పెద్ద హిట్టు" అని రొమ్ములు బాదుకుంటూ చెప్పుకునే ఈ రోజుల్లో ఈ "ప్రేమ కావాలి" చిత్రం నిశ్శన్దంగా 75 సెంటర్లలో 50 రోజులు ఆడింది. ముఖ్యంగా హీరో ఆదికి ఇది తొలి చిత్రమైనా ఎంతో అనుభవమున్న హీరోలా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుని, విమర్శకుల ప్రశంసలు సైతం పొందటం విశేషం. హీరో ఆది నటన, డ్యాన్సుల్లో, ఫైట్స్ లో చురుకుదనం, అనూప్ రూబెన్స్ వీనులకింపైన సంగీతం, విజయభాస్కర్ దర్శకత్వ ప్రతిభ, రాజీ పడకుండా నిర్మించిన నిర్మాత డాక్టర్ వెంకట్ నిర్మాణపు విలువలు, వీటన్నిటికంటే కె.అచ్చిరెడ్డిగారి పర్యవేక్షణ, బి.ఎ.రాజుగారి ప్రమోషన్ కలగలసి విశేష ప్రేక్షకాదరణతో ఈ "ప్రేమ కావాలి" చిత్రానికింతటి ఘనవిజయం సమకూర్చాయని చెప్పవచ్చు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.