English | Telugu
ప్రభాస్ పెళ్లిలో ఊహించని ట్విస్ట్
Updated : Jan 4, 2016
ఈయేడాది ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడన్నది అందరికీ తెలిసిన విషయమే! ప్రభాస్ పెదనాన్న కృష్ఱంరాజు ఆల్రెడీ ప్రభాస్‌కి సరిపడ సంబంధం భీమవరంలో చూసేశారని, అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోందని, ఈ యేడాది ఆమె చదువు అయిపోతుందని వెంటనే ప్రభాస్ తో పెళ్లి చేసేస్తారన్న వార్త ఫిల్మ్ నగర్ అంతా టాం టాం అయిపోయింది.
అయితే.. ఇప్పుడు ప్రభాస్ ఊహించని ట్విస్టిచ్చాడు. తన పెళ్లి ఫిక్సయ్యిందన్న వార్తల్లో నిజం లేదని తేల్చేశాడు. అంతేకాదు.. తనకు నచ్చిన అమ్మాయి ఇంకా కనిపించలేదని, కనిపించగానే పెదనాన్నతో చెప్పి, పెళ్లి చేసుకొంటానని చెబుతున్నాడు ప్రభాస్. అంటే.. ప్రభాస్ పెళ్లి విషయంలో పెదనాన్న కృష్ణం రాజు ప్రమేయం ఏమీ ఉండదన్నమాట.
తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకొంటానన్న విషయాన్ని ప్రభాస్ ఇలా పరోక్షంగా చెప్పేశాడని, ప్రభాస్‌ది లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న మరో వార్త వినిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్ పెళ్లయితే ఫిక్సవ్వలేదన్నది స్పష్టం. అమ్మాయిలూ..ఇక మీ ట్రైల్స్ మీరు వేసుకోవచ్చు.