English | Telugu
ఒకరితో లవ్వు.. ఇంకొకరితో రొమాన్సూ
Updated : Jan 5, 2016
టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న రాశీఖన్నాపై రూమర్లేం తక్కువగా రాలేదు. తొలి సినిమా చేస్తున్నప్పుడే ప్రేమలో పడిపోయిందని చెప్పుకొన్నారు. ఊహలు గుసగుసలాడే సినిమా చేస్తున్నప్పుడే నాగశౌర్యతో లవ్వాట ఆడిందన్న గుసగుసలు వినిపించాయి. సినిమా అయిపోయినా.. కొన్నాళ్లు వీళ్ల మధ్య కెమిస్ట్రీ నడిచిందని టాక్.
నాగశౌర్య ఇంట్లో ఈ విషయం తెలిసి సీరియస్ అయ్యారని.. ఆ తరవాత ఈ ప్రేమాయణానికి పుల్‌స్టాప్ పడిందని సమాచారం. అయితే.. ఇప్పుడు మరో యువ హీరోతో రాశీఖన్నా రొమాన్స్ మొదలెట్టేసిందట. ఇద్దరూ ఇప్పుడు డీప్ లవ్‌లో ఉన్నారని.. షూటింగులు లేకపోతే.. ఇద్దరూ లాంగ్ డ్రైవ్‌లతో హంగామా చేస్తున్నారని టాక్.
హైదరాబాద్‌లో రాశీ సెటిల్ అవ్వడానికి.. ఇక్కడో ఫ్లాటు చూసుకోవడానికి ఆ హీరో... బాగా సాయం చేశాడట. అంతేకాదు.. హైదరాబాద్ శివార్లలో రాశీఖన్నాకు ఓ ఖాళీ స్థలం చీప్‌లో కొని పెట్టాడని టాక్. మొత్తానికి ఒక హీరోతో లవ్.. మరో హీరోతో రొమాన్స్ డ్రామా నడుపుతున్న రాశీ... మహా ముదురుదే.