English | Telugu

అనుష్క కోసం రంగంలోకి ప్రభాస్.. నేను ఊరుకోనంటున్నప్రముఖ నటి 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas),అనుష్క(Anushka)ఫెయిర్ కి సిల్వర్ స్క్రీన్ పై మంచి క్రేజ్ ఉంది. మిర్చి, బాహుబలి సిరీస్ సక్సెస్ లే అందుకు ఉదాహరణ. సినిమాల పరంగా కాకుండా,వ్యక్తిగతంగా కూడా, ఆ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పైగా ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఎప్పట్నుంచో వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలని ఇద్దరు ఎక్కడ ఖండించలేదు. దీంతో పెళ్లి న్యూస్ పై మరింతగా చర్చ జరుగుతూనే ఉంది.

అనుష్క టైటిల్ రోల్ ని పోషించిన 'ఘాటి'(Ghaati)రేపు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో 'ఘాటి' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ గ్లింప్స్ విడుదలైంది. ఎంతో పవర్ ఫుల్ గా ఉన్న గ్లింప్స్ లో యాక్షన్ సన్నివేశాలు, అనుష్క రౌద్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా చివర్లో 'వాళ్ళు ఊరుకోరు, వీళ్లు ఊరుకోరు అంటే నేను ఊరుకోను' అని అనుష్క చెప్పిన డైలాగ్ అయితే సూపర్ గా ఉంది. ఏ ఉద్దేశ్యంతో 'ఘాటి' తెరకెక్కిందనే విషయాన్నీ కూడా ఆ డైలాగ్ ద్వారా చెప్పించినట్టయ్యింది. ఇక ముందుగా చేసుకున్న ఒప్పంద ప్రకారం ఘాటి ప్రమోషన్స్ లో అనుష్క పాల్గొనడం లేదు. దీంతో ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ గ్లింప్స్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఘాటి కి విభిన్న దర్శకుడు 'క్రిష్(Krish)జాగర్లమూడి 'దర్శకత్వం వహించాడు ఇంతకు ముందుకు ఈ ఇద్దరి కాంబోలో వేదం వచ్చి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యరావు, జిష్ణు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.