English | Telugu

పవన్ పాదాలకు నమస్కరించిన హీరోయిన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకున్న పవర్ అంతా ఇంతా కాదు. వ్యక్తిగతంగానూ..వృత్తిగతం గానూ తన ప్రవర్తన ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పవన్. సామాన్యులే కాదు..ప్రముఖులు కూడా ఆయన్ను అభిమానిస్తారు...ఆరాధిస్తారు. తాజాగా పవన్ వీరాభిమాని నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సినిమాలో ఒక హీరోయిన్‌గా చేసిన మళయాళీ ముద్దుగుమ్మ "అనుపమ పరమేశ్వరన్"ను సాంగ్ లాంఛ్‌కి స్టేజ్‌ మీదకు ఆహ్వానించింది యాంకర్ సుమ. అనుపమ స్టేజ్ మీదకు వస్తుండగా ముందు వరుసలో కూర్చోని ఉన్న పవన్‌ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. పవన్ వద్దని వారించినా ఆమె ఆయన కాళ్లు వదల్లేదు. అంతేకాదు స్టేజ్ మీద మాట్లాడుతూ పవర్ స్టార్‌ని ఆకాశానికెత్తేసింది. ఒక్కసారి మళయాళంలో నటించాలని కోరింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.