English | Telugu

మహేష్ బాబు సినిమాలో ఆ బాలీవుడ్ భామ..?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమాను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. పూర్తి క్లాస్ సినిమాగా తెరకెక్కిన బ్రహ్మోత్సవంతో హాట్ సమ్మర్ లో కూల్ హిట్ కొట్టడానికి చూస్తున్నాడు మహేష్. మరో వైపు ఈ సినిమా తర్వాత మురుగదాస్ తో చేసే సినిమాకోసం ప్రిపేర్ అవుతున్నాడు. మురుగదాస్ డైరెక్షన్లో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కబోతోందట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మహేష్ కు ఇప్పటికే హిందీలో మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో పాటు హిందీ గ్లామర్ కోసం దీపికా పదుకుణేను హీరోయిన్ గా తీసుకోవాలనేది మురుగదాస్ ప్లాన్. ఇప్పటికే పరిణీతి చోప్రా పేరు కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ భారీ బడ్జెట్ మూవీకి దీపిక అయితేనే కరెక్ట్ అని మూవీ టీం భావిస్తున్నారట. ఒక వేళ ఇది నిజమైతే మాత్రం, దీపిక సౌత్ లో నటించే సెకండ్ మూవీ ఇదే అవుతుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.