English | Telugu

'పోర్ తొళిల్' మూవీ రివ్యూ

సినిమా పేరు: పోర్ తొళిల్
నటీనటులు: ఆర్. శరత్‌కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్, నిజల్ గల్ రవి, శరత్ బాబు, పిఎల్ తేనప్పన్, ఓఏకే సుందర్ తదితరులు
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
సినిమాటోగ్రఫీ: కలైసెల్వన్ శివాజీ
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెగల్, ముఖేశ్ ఆర్. మెహతా, సీవి శరత్
రచన: ఆల్ఫ్రెడ్ ప్రకాష్, విఘ్నేష్ రాజా
దర్శకత్వం: విఘ్నేష్ రాజా
ఓటీటీ: సోని లివ్

చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా క్రైమ్ థ్రిల్లర్స్ కి ఉండే అదరణే వేరు. అలాంటిదే శరత్ కుమార్, అశోక్ సెల్వన్ కలిసి నటించిన 'పోర్ తొళిల్'. ఇటీవల తమిళ్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటో ఒకసారి చూసేద్దాం.

కథ:
తిరుచ్చిలోని ఒక ఏరియాలో నైట్ డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులకి ఒక అడవిలో అమ్మాయి శవం కనిపిస్తుంది. దానిని చూసిన తర్వాత ఇది ఇంతకముందు జరిగిన హత్యలా ఉందని కానిస్టేబుల్ పైఅధికారికి చెప్తాడు. దాంతో ఈ కేస్ ని స్పెషల్ బ్రాంచ్ కి బదీలీ చేస్తారు. స్పెషల్ అధికారిగా లోక్ నాథన్(శరత్ కుమార్).. అతనికి అసిస్టెంట్ గా కొత్తగా డ్యూటిలోకి జాయిన్ అయిన ప్రకాశ్(అశోక్ సెల్వన్) నియమించబడతారు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ ని మొదలుపెట్టగా.. ఇదే పద్ధతిలో మరో రెండు హత్యలు జరుగుతాయి. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో కెనడీ(శరత్ బాబు) ని సస్పెక్ట్ గా అనుమానిస్తారు‌. మరి ఈ హత్యలన్నింటికి కెనడీకి సంబంధమేంటి? ఈ వరుస హత్యలు చేస్తుందెవరనేది పోలీసులు కనిపెట్టారా లేదా అనేదే మిగతా కథ..

విశ్లేషణ:
ఒక క్రైమ్.. దానిని విచారిస్తూ కొందరు పోలీసులు. కొన్ని రోజుల తరవాత అవి సీరియల్ కిల్లర్ చేసే పనులని తెలుసుకోవడం.. అప్పుడు వాటిని సీరియస్ గా తీసుకొని స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు రావడం వాటిని విచారించి పరిష్కరించడం.. ఇందులో ఎన్నో ట్విస్ట్ లు మలుపులు. ఇలాంటి సీరియస్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ లని ఇష్టపడే సినిమా లవర్స్ చాలానే ఉన్నారు. అయితే వీటిని ప్రెజెంట్ చేసే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండాలి. కథ ప్రేక్షకుడిని చివరిదాకా సస్పెన్స్ తో ఎంగేంజ్ చేయాలి. ఇవన్నీ సరిగ్గా కుదిరితేనే ఈ క్రైమ్ థ్రిల్లర్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. అలాంటివన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ, సరైన కథనాన్ని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు విఘ్నేష్ రాజా సక్సెస్ అయ్యాడు. ప్రతీ పాత్రకి ఒక ఇంపార్టెంటెన్స్ ఇస్తూ కథనం నడిపిన తీరు ఆకట్టుకుంది.

అప్పుడే డ్యూటీలోకి జాయిన్ అయిన ఇన్ స్పెక్టర్ ప్రకాశ్(అశోక్ సెల్వన్), అతని పై అధికారి లోక్ నాథన్(శరత్ కుమార్) తో కలిసి తొలి కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ కథ కాస్త నెమ్మదిగా మొదలవుతుంది. మొదటి ముప్పై నిమిషాలు పాత్రలన్నీ పరిచయం చేస్తూ కాస్త నెమ్మదించింది కథ. ఎప్పుడైతే ప్రకాశ్ క్రైమ్ సాల్వ్ చేస్తూ, లోక్ నాథన్ చెప్పే సూచనలను ఫాలో అవుతూ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడో అప్పుడు కథలో వేగం పెరుగుతుంది.

ప్రథమార్ధమంతా క్యారెక్టర్లను పరిచయం చేస్తూ ఒక్కో క్లూని కనిపెడుతున్న లోక్ నాథన్, ప్రకాశ్ లకి ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ ఎదురవుతుంది. హాత్యలు చేస్తుంది కెనడీ(శరత్ బాబు) అని ఒక అంచనాకి వస్తారు. ఇక నేరస్తుడి దొరికిపోయాడని అనుకునే టైం లో అసలు ట్విస్ట్.. అవన్నీ క్రైమ్స్ చేసింది కెనడీ కాదని. మరెవరు.. ఇలాంటి ఎంగేజింగ్ సస్పెన్స్ తో ప్రేక్షకుడిని చివరి నిమిషం వరకు కూర్చోబెట్టాడు డైరెక్టర్ విఘ్నేష్ రాజా. అయితే ప్రీ క్లైమాక్స్ లో హంతకుడి మోటివ్ కనిపెట్టామని అనుకునే అధికారులకి మరో ట్విస్ట్ ఇస్తూ.. సస్పెన్స్ ని ఇంకా పెంచుతూ ప్రేక్షకుడికి ఒక సరికొత్త థ్రిల్ ని ఇచ్చాడు డైరెక్టర్. 'ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా రిటైర్ అయ్యిన అధికారులు ఎంత మంది ఉన్నారో తెలుసా' అనే డైలాగ్ ని కనెక్ట్ చేస్తూ క్లైమాక్స్ ని తీసిన తీరు ఆకట్టుకుంది.

జేక్స్ బిజోయ్ అందించిన బిజిఎమ్ నెక్స్ట్ లెవల్. హంతకుడిని పరిచయం చేసినప్పుడు వచ్చే బిజిఎమ్ కి అందరు కనెక్ట్ అవుతారు. కలైసెల్వన్ శివాజీ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ముఖ్యంగా క్రైమ్ లో డెడ్ బాడీని చూపెడుతున్న కొన్ని షాట్స్ బాగున్నాయి. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ బాగుంది. అయితే ఫస్టాఫ్ లో కొన్ని సీన్లకి కత్తెర వాడాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
ఎస్పీ లోక్ నాథన్ గా శరత్ కుమార్ ఒదిగిపోయాడు. ఒక సీనియర్ అధికారి పాత్రకు తగ్గట్లుగా చక్కగా రాణించాడు. అతడి జూనియర్ ఆఫీసర్ గా డీఎస్పీ ప్రకాశ్ పాత్రలో అశోక్ సెల్వన్ ఆకట్టుకున్నాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో అక్కడక్కడా అతడి కామెడీ బాగుంది. వీణగా నిఖిలా విమల్ ఆకట్టుకుంది. ఇక మిగిలిన వారు వారి పాత్రల మేర బాగా నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:
ఈ వీకెండ్ కి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ ని చూడాలనుకువారికి ఈ మూవీ ఒక ఫీస్ట్.

రేటింగ్: 4/5

✍🏻.దాసరి మల్లేశ్

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.