English | Telugu
కోట్లు విలువ చేసే ఇంటి సెట్ మహేష్ బాబు!
Updated : Aug 12, 2023
సూపర్ స్టార్ మహేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే కొంత మేరకు చిత్రీకరణ పూర్తయ్యింది. అయితే ఇప్పుడు జరగాల్సిన షెడ్యూల్ ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఫ్యాన్స్‌లో టెన్షన్ క్రియేట్ అయ్యింది. అందుకు కారణం.. ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ సజావుగా సాగటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయటం అనేది కష్టం కావచ్చుననే న్యూస్ వైరల్ అవుతుంది.
కానీ ఇప్పుడా న్యూస్‌కు చెక్ పెడుతున్నారు మేకర్స్. ఎందుకంటే ‘గుంటూరు కారం’ కోసం హైదరాబాద్‌లో ఏకంగా రూ. 4 కోట్లు ఖర్చు పెట్టి ఖరీదైన ఇంటి సెట్‌ను డిజైన్ చేశారు. ఆగస్ట్ 16 నుంచి సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు సహా ప్రధాన తారాగణమంతా పాల్గొనబోతున్నారు. కంటిన్యూగా సినిమాను మేజర్ బ్రేక్స్ లేకుండా పూర్తి చేయాలని యూనిట్ డిసైడ్ అయ్యింది. అందుకు మహేష్ సైతం రెడీ అయిపోయారట. మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ మేరకు, నవంబర్ చివరికంతా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే డిసెంబర్ నాటి నుంచి రాజమౌళి సినిమాపై సూపర్ స్టార్ ఫోకస్ పెట్టబోతున్నారు.
మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా ఓకే అయినప్పటికీ.. రీసెంట్‌గా ఆమె డ్రాప్ అయ్యింది. ఆమె స్థానంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్ డేట్ కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.