English | Telugu

Perusu Movie Review: పెరుసు మూవీ రివ్యూ

Perusu Movie Review: పెరుసు మూవీ రివ్యూ

 

మూవీ: పెరుసు
నటీనటులు: వైభవ్, నిహారిక, సునీల్ రెడ్డి, శరవణన్, మునిష్ కాంత్, చాందిని తమిళరసన్, రెడిన్ కింగ్స్ లీ, వీటి గణేష్, దీపా శంకర్ తదితరులు
ఎడిటింగ్: సూర్య కుమారగురు
మ్యూజిక్: అరుణ్ రాజ్
సినిమాటోగ్రఫీ: సత్య తిలకం
నిర్మాతలు: కార్తీకేయన్ సంతానం, హర్మన్ బేవజా, హిరణ్య పెరెరా
దర్శకత్వం: ఇళంగో రామ్
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్

కథ: 

హలసాయం అనే వ్యక్తి ఓ ఊళ్ళో పెద్దమనిషిలా ఉంటాడు. అతనికి ఇద్దరు కొడుకులు. ఒకతను అదే ఊళ్ళో టీచర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. చిన్న కొడుకు జులాయిగా తాగి తిరుగుతుంటాడు.‌ అయితే ఒకరోజు హలసాయం చనిపోతాడు. ఆ విషయం మొదటగా తన పెద్ద కొడుకు చూస్తాడు. అయితే అతను చనిపోయిన బాధ కంటే ఎలాంటి పరిస్థితులలో చనిపోయాడనేది చూసి ఇబ్బంది పడతాడు. అదే విషయం తన తమ్ముడికి చెప్పగా అతను వచ్చి చూస్తాడు. ఆ రకంగా ఎలా చనిపోతాడనేది ఇద్దరికి అర్థం కాదు. ఇక ఇద్దరు ఆ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయాలని డాక్టర్ ని సంప్రదిస్తారు. కానీ ఫలితం శూన్యం. అసలు హలసాయం ఎలా చనిపోయాడు? ఆ పరిస్థితిలో చనిపోయిన హలసాయం బాడీని ఎవరికి కనపడకుండా కుటుంబమంతా ఎలా మేనేజ్ చేసారనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 

సినిమా ప్రారంభంలో ఓ కుర్రాన్ని హలసాయం కొట్టే సీన్ తో ఆసక్తిగా మొదలవుతుంది. అయితే హలసాయం చనిపోయిన తర్వాత కథ పూర్తిగా కామెడీగా మారిపోతుంది. అసలు మనిషి చనిపోతే ఏడవాలి కానీ అతను అలాంటి ఒక పరిస్థితిలో చనిపోతే.. ఎవరు  చూడకుండా దానిని మేనేజ్ చేసే పనిలో కుటుంబమంతా ఇబ్బంది పడటం ఫుల్ కామెడీగా అనిపిస్తుంది.

ఇది ఫ్యామిలీతో కలిసి చూడలేకుండా ఒక బోల్డ్ కంటెంట్ మీద నడుస్తుంది. అయితే అది బోల్డ్ కంటెంట్ అయినప్పటికీ సెన్సిబుల్ కామెడీ ఉంటుంది. ఇండివిడ్యువల్ గా చూస్తే ఫుల్ నవ్వుకుంటారు. నిజానికి ఇలాంటి ఓ పాయింట్ మీద ఇంతవరకు ఒక్కంటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. కొత్త కాన్సెప్ట్ బాగుంది. అయితే కాస్త మధ్యలో డ్రాగ్ చేసారు. 

సినిమా మొత్తం ఒకే పాయింట్ తో నడవడం కాస్త ల్యాగ్ అనిపించిన ఎక్కడో ఒక దగ్గర నవ్వుతూనే ఉంటాం‌. మనిషి చనిపోయాక ఏడ్వాలి కానీ ఇలా యాక్ట్ చేస్తున్నారేంటనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతుంది. కానీ క్లైమాక్స్ లో ఈ పాయింట్ కి సరైన క్లారిటీ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఒకే. ఎడిటింగ్ పర్వాలేదు. మధ్యలో కొన్ని సీన్లు ట్రిమ్ చేస్తే బాగుండు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

వైభవ్, నిహారిక, సునీల్ రెడ్డి, శరవణన్, మునిష్ కాంత్, చాందిని తమిళరసన్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు. 

ఫైనల్ గా : ఫ్యామిలీతో చూడకుండా ఇండివిడ్యువల్ గా చూస్తే బెటర్. కొత్త కాన్సెప్ట్.. మస్ట్ వాచెబుల్ .

రేటింగ్: 2.75 / 5

✍️. దాసరి మల్లేశ్