English | Telugu
అల్లుఅర్జున్ రెమ్యునరేషన్ తీసుకోలేదు
Updated : Apr 11, 2025
తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా ఉంటు అభిరుచి గల చిత్రాలని నిర్మిస్తూ వస్తున్న ప్రొడ్యూసర్ మల్లిడి సత్యనారాయణ రెడ్డి(Mallidi Satyanarayana reddy).అల్లు అర్జున్(Allu Arjun)కెరిరీలో ఫస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచిన 'బన్నీ'(Bunny)మూవీతో పాటు అన్వేషణ,ఢీ,భగీరధ వంటి పలు చిత్రాలు నిర్మించాడు.
రీసెంట్ గా సత్యనారాయణ రెడ్డి ఒక ఇంటర్వ్యూ లో 'బన్నీ' మూవీకి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఆయన మాట్లాడుతు దర్శకుడు వినాయక్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్న టైం లో మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల నాకు కూడా తెలియకుండానే సత్యనారాయణ రెడ్డి తో సినిమా చేస్తున్నానని వినాయక్(VV Vinayak)చెప్పాడు.దాంతో మేము డబ్బులు ఇస్తామంటే మేము ఇస్తామంటు ఫైనాన్షియర్లు వచ్చారు.ఆ తర్వాత అల్లుఅరవింద్ గారు వచ్చి వినాయక్ డేట్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అల్లు అర్జున్ తో సినిమా చేద్దామని చెప్పారు.ఆ విధంగా బన్నీ మూవీ సెట్స్ మీదకి వెళ్ళింది.
చేతిలో ఒక్క రూపాయి లేకుండా సినిమా కంప్లీట్ చేశాను.కనీసం ముహూర్తం షాట్ కి కొట్టే కొబ్బరికాయ ఖర్చు కూడా నాది కాదు.అల్లుఅర్జున్ కి రెమ్యునరేషన్ లేకుండా సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన లాభాల్లో డబ్బులు ఇచ్చామని చెప్పుకొచ్చాడు.
