English | Telugu
"పెళ్ళెందుకు...?"- పూరీ జగన్నాథ్
Updated : Mar 1, 2011
ఈ భూమ్మీద ఎవడూ ఆర్గ్యూ చేయలేని ఒక నగ్న సత్యం ఏటంటే పెళ్ళి చేసుకునే మనుషుల జంటల కంటే పెళ్ళి చేసుకోని జంతువుల జంటలే హాయిగ తోడు గడుపుతాయనేది.ఏ ఆడ పిల్ల Expectation కీ ఏ మగాడూ రీచ్ అవలేడు. అల్లాగే ఒక మగాడు అన్ని విధాలా కోరుకునేలా ఏ ఆడదీ వుండదు. పెళ్ళిళ్ళు ఫ్లాపయ్యేది Expectations వల్ల. ఒకవేళ ఎవరైనా వాళ్ళ పెళ్ళి సూపరహిట్ అన్నారంటే అది పబ్లిసిటీ కోసమే తప్ప జీవిత బాక్స్ఆపీస్ విజయం కాదు... ప్రతీ అమ్మాయి వీడు మారతాడులే అని పెళ్ళి చేసుకుంటుంది ప్రతీ అబ్బాయి ఇది మారదు ఇలాగే ఉంటుంది అని చేసుకుంటాడు కానీ పెళ్ళి వాడిని మారనివ్వదు... ఈవిణ్ణి మార్చేస్తుంది..
ప్రేమ అనేది అమ్మాయి అబ్బాయి సోఫాలో ముద్దులు ముచ్చట్లు ఆడుకోవటం.. పెళ్ళి అనేది అదే సోఫాలో ఎవరో ఒకరే ముడుచుకుని పడుకోవటం... ఈ పెళ్ళి అనేది ఎవడు, ఎందుకు కనిపెట్టాడో నాకు తెలీదు కానీ... వాడు కానీ నాకు దొరకితే కాళ్ళూ చేతులు కట్టి దగ్గరుండి పెళ్ళి చేస్తా...." అంటున్నాడు పూరీ జగన్నాథ్. దీన్ని బట్టి చూస్తే ఈ "పెళ్ళి" అనే సినిమా మన హిందూ వివాహ వ్యవస్థని ఎంతగా అవహేళన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పైత్యాన్ని ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.