English | Telugu
హిట్ కోసం మొరపెట్టుకొన్న పవన్
Updated : Jan 5, 2015
గోపాల గోపాల ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఆడియోకే హైలైట్ గా నిలిచింది. పవన్ చాలా సింపులగా ఉంటాడు. అంతే సింపుల్ గా మాట్లాడతాడు. లోపల ఉన్నది ఉన్నట్టుగానే బయటకు చెప్పేస్తాడు. గోపాల గోపాల ఆడియో వేడుకలోనూ అదే జరిగింది. మరోసారి పవన్ తన సింప్లిసిటీని ఆవిష్కరించుకొన్నాడు. పవన్ ఫ్యాన్స్‌కి సరికొత్త సంగతులు బోధించాడు. జయాపజయాలు తన చేతుల్లో లేవని.. అయినా తాను కష్టపడతానని, ఈ ప్రపంచానికి భయపడి పారిపోనని, ఇక్కడే సాధించి తీరుతానని ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు పవన్.
తన పరాజయాల్నీ కుండ బద్దలు కొట్టినట్టు ఒప్పుకొన్నాడు. ఖుషీ తరవాత తనకు గడ్డు రోజులు రాబోతున్నాయని, పరాజయాలు ఎదుర్కోబోతున్నానని పవన్ కి ముందే తెలిసిందట. తన బ్యాడ్ పిరియడ్ గురించి ముందే సంకేతాలు అందేశాయట. `ఒక్క హిట్టు కొట్టన్నా.. ఒక్క హిట్టు కొట్టన్నా..` అని అభిమానులు గుండెలు బాదుకొంటుంటే తొలిసారి దేవుడ్ని `దేవుడా ఓ హిట్టివ్వు.... ఈ ఇండ్రస్ట్రీ నుంచి వెళ్లిపోతా..` అని మొరపెట్టుకొన్నాడట పవన్.