English | Telugu

ఆహుతి ప్రసాద్‌కు టాలీవుడ్ నివాళి

తెలుగు నటుడు ఆహుతిప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణంపై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. అభిమానుల దర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి నుంచి ఫిల్మ్‌నగర్‌లో ఆయన ఇంటికి ఆహుతి ప్రసాద్ భౌతికకాయాన్ని తరలించారు.ప్రసాద్ పార్థీవదేహానికి నటీనటులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

‘‘ఎన్నో మంచి పాత్రలకు తన విలక్షణ శైలితో ప్రాణం పోసిన నటుడు ఆహుతి ప్రసాద్‌. అనారోగ్యం పాలైన అతను త్వరగా కోలుకుంటారనుకున్నాను. కానీ అంతలో ఘోరం జరిగిపోయింది. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు.’’ - మోహన్‌బాబు

‘‘ఆహుతి ప్రసాద్‌గారు కన్నుమూయడం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. చాలా మంచి సపోర్టింగ్‌ ఆర్టిస్ట్‌ ఆయన. వాళ్ల కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.’’ - ఎన్టీఆర్‌

‘‘రెండు రోజుల క్రితం ఫోనులో మాట్లాడా. వచ్చి కలుస్తానంటే వద్దన్నారు. ఆయన పోయారన్న వార్త విని షాక్‌లో ఉన్నా.’’ - వి.వి.వినాయక్‌

‘‘ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల అరుదైన నటుడు ఆహుతి ప్రసాద్‌గారు. ‘తులసి’, ‘దమ్ము’, ‘లెజెండ్‌’ సినిమాల్లో ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలను మర్చిపోలేను’’ - బోయపాటి శ్రీను

‘‘టిపికల్‌ కామెడీని పండించగలిగిన వ్యక్తి ఆహుతి. తను నవ్వకుండా ఎదుటివారిని నవ్వించగలిగే సత్తా ఆయన సొంతం. ఎన్ని సీరియస్‌ పాత్రల్ని చేసినా ఆఫ్‌ స్ర్కీన్‌లో చాలా జోవియల్‌గా ఉండేవారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో పలు కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించే వారు.’’ - శ్రీకాంత్‌

‘‘కమెడియన్‌గా, క్యారక్టర్‌ ఆర్టిస్టుగా రకరకాల పాత్రల్లో నటించిన నటుడు ఆహుతి ప్రసాద్‌గారు. హీరోగా తప్ప అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పించారు.’’ - అలీ

‘‘నవ్వించడం, ఏడిపించడం, విలనిజం... ఏ పాత్రనైనా అద్భుతంగా పండించగల నటుడు ఆహుతి ప్రసాద్‌. ఆయనతో కలిసి నటించిన ప్రతి సినిమా నాకు మెమరబుల్‌ మూవీనే. అందరినీ కలుపుకుని పోయే ఆయన లేరని తెలిసి షాక్‌తిన్నాను.’’ - అల్లరి నరేష్‌

‘‘‘రైడ్‌’, ‘జండాపై కపిరాజు’ సినిమాల్లో నేను ఆహుతిప్రసాద్‌గారితో కలిసి నటించాను. వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌ ఆయన. ఆయన్ని పోగొట్టుకున్నందుకు బాధగా ఉంది.’’ - నాని

‘‘ఆహుతి ప్రసాద్‌గారి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెళ్లి పరామర్శించా. ఇతర థెరపీలను కూడా సజెస్ట్‌ చేశా. ఈ మధ్య ఆయన నాకు బాగా దగ్గరయ్యారు. అంతలోనే ఇలా జరిగింది.’’ - రాజశేఖర్‌

‘‘ఆహుతి ప్రసాద్‌ కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ‘మా’ అసోసియేషన్‌కు కార్యదర్శిగా పనిచేశారు. ఎప్పుడూ పేద నటీనటులకు సాయం చేయాలన్న సంకల్పంతో పనిచేసేవారు. గతేడాది పలువురు సినీ ప్రముఖులు పోయారనే బాధతో ఉన్నాం. ఈ ఏడాది మొదలైన నాలుగు రోజుల్లోపే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు.’’ -
మురళీమోహన్‌

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.