English | Telugu
పవన్ సినిమా - పరమవీర చక్ర 2??
Updated : Feb 24, 2015
ఏంటీ..??? దాసరి - పవన్‌ల కాంబినేషనా?? అంటూ అందరూ ముక్కున వేలేసుకొంటున్నారు. కలలో కూడా ఊహించని కలయిక ఇది. అసలు ఏమాత్రం సంబంధం లేని రెండు భిన్నధృవాలు కలశాయంటే ఇప్పటికీ చాలామందికి షాక్‌గానే ఉంది. ఆమధ్య సినిమాలకు దూరమై, దాదాపుగా అస్త్రసన్యాసం చేసిన దాసరి, ఆ తరవాత మళ్లీ జోరు పెంచారు. పరమ వీర చక్రతో డిజాస్టర్ మూటగట్టుకొన్నా - మొన్న ఎర్రబస్సు తీశారు. ఆ సినిమా తుస్సుమంది. ఆతరవాత దాసరి కాంపౌండ్ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు సినీ జనాన్ని నివ్వెర పరుస్తూ దాసరి - పవన్ ల కలయిక ఖాయమైంది. వీరిద్దరూ కలిస్తే ఎలాంటి సినిమా తీస్తారు? పూర్తి కమర్షియల్ సినిమా అయినా అయ్యుండాలి, లేదంటే దేశభక్తి ప్రభోదాత్మక చిత్రమనా అయ్యండాలి. ఎందుకంటే దాసరి శైలి అదే కాబట్టి. అయితే ఎలాంటి సినిమాలో అయినా నటించడానికి పవన్ రెడీగానే ఉంటాడు. ఎందుకంటే సందేశాత్మక చిత్రమంటే.. పవన్ కీ ప్రత్యేక అభిమానం. తన సినిమాల్లో, పాటల్లో సందేశం ఉండేట్టు జాగ్రత్తపడతాడు కూడా. అయితే ఈసినిమాకి దర్శకుడు దాసరి కాదు.. మరెవరోనట. కథ సిద్ధమై.. దర్శకుడి కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. దాసరి - బాలకృష్ణ కలిసినప్పుడు కూడా ఆ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. మరో బొబ్బిలి పులి అనుకొన్నారంతా. కానీ ఏమైంది?? పరమవీర చక్ర పరాజయం మూటగట్టుకొంది. ఇప్పుడు పవన్ - దాసరిల సినిమా అంటే అంతకంటే ఎక్కువ అంచనాలుంటాయి. వాటిని కాపాడుకొంటూ సినిమా తీస్తే మంచిదే. లేదంటే మరో పరమవీర చక్రఅవుతుందేమో అని భయపడుతున్నారు పవన్ ఫ్యాన్స్.