English | Telugu

పూరివి కోటి రూపాయ‌లు పోయాయ్‌!

టెంప‌ర్ విజ‌యంతో సంబ‌రాలు చేసుకొంటోంది టీమ్‌. ఎన్టీఆర్ భ‌లే చేశాడు, పూరి అద్భుతంగా తీశాడు... అంటూ మెచ్చుకోళ్లు వినిపిస్తున్నాయ్‌. అయితే వ‌సూళ్లు మాత్రం నాలుగో రోజు నుంచే డ‌ల్ అయిపోయాయ‌ని టాక్‌. ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కూ రూ.30 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. సినిమాకి అయ్యింది రూ.40 కోట్లు.. ఇంకో ప‌ది కోట్లు రావ‌డం గ‌గ‌న‌మే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. స్వ‌యంగా పూరిజ‌గ‌న్నాథ్‌కి రూ.కోటి పోయాయ‌ని టాక్‌. ఈ సినిమా వెస్ట్ గోదావ‌రి రైట్స్ పూరి త‌న వ‌ద్దే ఉంచుకొన్నాడు. దాని నిమిత్తం రూ.2.5 కోట్లు బండ్ల‌కు తిరిగి ఇచ్చేశాడు. అయితే ఇప్ప‌టికి రూ.1.5 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ట‌. అంటే మ‌రో కోటి రూపాయ‌లు రావాలి. ఇక వెస్ట్ గోదావ‌రి నుంచి పైసా కూడా రాదు. ఎందుకంటే అక్క‌డ టెంప‌ర్‌థియేట‌ర్లు డెఫ్‌షీట్ల‌లో న‌డుస్తోంది. అంటే సినిమా న‌డిపించుకోవాలంటే డ‌బ్బులు తిగిరి చెల్లించాల‌న్న‌మాట‌. అంటే వ‌చ్చిన కోటిన్న‌ర కూడా మెల్ల‌గా క‌ర‌గ‌డం ఖాయం. టెంప‌ర్ వ‌ల్ల ద‌ర్శ‌కుడిగా పూరికి పేరొచ్చిందేమోగానీ, పంపిణీదారుడిగా కోటి రూపాయ‌లు పోగొట్టుకొన్నాడ‌న్న‌మాట‌.