English | Telugu
అల్లు అరవింద్ కి బిగ్ షాక్.. రంగంలోకి ఈడీ..!
Updated : Jul 4, 2025
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంకు స్కాం కేసుకు సంబంధించి అరవింద్ ను ఈడీ అధికారులు దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించారని సమాచారం. 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై అల్లు అరవింద్ ను ఈడీ అధికారులు వివరాలు అడిగినట్లు వినికిడి. విచారణ అనంతరం వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని అల్లు అరవింద్ కు అధికారులు ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు.
రామకృష్ణ సంస్థ.. బ్యాంకుల నుంచి వంద కోట్లకు పైగా రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది. లావాదేవీలలో అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఆ సంస్థ లావాదేవీలలో అల్లు అరవింద్ పేరు కూడా ఉండటంతో.. ఈడీ విచారణకు పిలిచిందని చెబుతున్నారు. అయితే అసలు ఆ సంస్థతో గానీ, ఆ స్కాంతో గానీ అల్లు అరవింద్ కి సంబంధం ఉందా లేదా? అని స్పష్టత లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
