English | Telugu
సర్దార్ గబ్బర్ సింగ్ కోసం పవర్ స్టార్ మళ్లీ పాటందుకున్నాడు
Updated : Mar 18, 2016
ఫ్యాన్స్ కు తనంటే ఎంత ఇష్టమో పవన్ కు బాగా తెలుసు. అందుకే వాళ్లను ఎప్పుడూ డిజప్పాయింట్ చేయడు. వీలైనంత వరకూ వాళ్లను ఎంటర్ టైన్ చేయడం మీదే పవన్ దృష్టి ఎప్పుడు ఉంటుంది. ఆడియో ఫంక్షన్లో తమ సొంత ఫ్యాన్స్ తమకోసమే అరుస్తున్నా వాళ్లను సైలెంటవ్వమని చెప్పే హీరోలున్నారు. వాళ్ల తప్పు లేదు. మాట్లాడే సమయంలో ఎదురుగా అరుస్తుంటే ఎవరైనా అలాగే చెబుతారు. కానీ తన ఫ్యాన్స్ ఎంత భీభత్సం చేస్తున్నా పవన్ మాత్రం చాలా ఓపిగ్గా భరిస్తుంటాడు. వాళ్లు సైలెంట్ అయ్యాకే మాట్లాడతాడు. అలాగని సైలెంట్ గా ఉండమని చెప్పడు. అతను మాట్లాడేముందు ఆటోమేటిక్ సైలెంట్ అయిపోతారు పవనిజం బ్యాచ్ అంతా. పవన్ కు, అతని భక్తులకు ఉన్న అనుబంధమది. సర్దార్ ను కూడా తన ఫ్యాన్స్ కే అంకితమిచ్చే ఆలోచనలో పవన్ ఉన్నాడు. ఆఖరికి ఆడియో ఫంక్షన్లో కూడా, ఫ్యాన్స్ ను ఎవరూ ఏమనకూడదని ఖచ్చితంగా రూల్స్ పాస్ చేశాడట.
ఫ్యాన్స్ ను ఇంత ఇష్టపడే పవన్ సర్దార్ లో ఫ్యాన్స్ కు మరో గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాడు. ఇప్పటి వరకూ రహస్యంగా ఉంచిన విషయం అది. సర్దార్ లో పవన్ ఒక పాట పాడాడట. ఫోక్ సాంగ్ మోడ్ లో సాగే ఈ పాటను పవన్ పాడాడనే వార్త ఫిలిం నగర్లో వినిపిస్తోంది. అత్తారింటికిది దారేదిలో పవన్ తో పాడించిన దేవి, సర్దార్ లో కూడా ఒక పాటేయించేశాడట. ఒకవేళ ఇది నిజమైతే, ఆడియో ఫంక్షన్ రోజే ఈ సాంగ్ తో పాటు, పవన్ పాడుతున్నప్పటి విజువల్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఫోక్ సాంగ్స్ అంటే పవన్ కు చాలా ఇష్టం. తమ్ముడు, ఖుషీ, జానీ, గుడుంబా శంకర్, మొన్న మొన్న అత్తారింటికి దారేదితో సహా తన సినిమాల్లో వీలైనంత వరకూ ఫోక్ టచ్ ఉంటే ఇష్టపడతాడు పవన్. కాటమరాయుడా పాటను, అది పాడుతున్నప్పుడు పవన్ ఎక్స్ ప్రెషన్స్ ను ఫ్యాన్స్ ఇంకా మరిచిపోలేదు. అందుకే ఇప్పుడు సర్దార్ లో పాట పవన్ ఎలా కుమ్మేసి ఉంటాడో అన్న విజువల్ ఆల్రెడీ ఊహించేసుకుంటున్నారు పవనిస్టులు. అన్ని ప్రశ్నలకు, పుకార్లకు ఆడియో ఫంక్షన్ రోజే సమాధానాలు దొరికేస్తాయి. వెయిట్ అండ్ సీ..