English | Telugu
సర్దార్ ఆడియో ఫంక్షన్ కు చిరు రానట్లేనా..?
Updated : Mar 12, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో గురించి మెగాభిమానుల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్ కు చిరు, నాగబాబు వస్తారా..? ఇన్నాళ్లూ ఏవో గొడవలున్నాయన్న పుకారుకు ఈ మధ్యే ఫుల్ స్టాప్ పడిన నేపథ్యంలో, మెగాబ్రదర్స్ ఫ్యాన్స్ కు తమ ఏకత్వాన్ని మరోసారి చాటుతారా..? ఒకవేళ అలా అనుకుంటే మాత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ ను మించిన సందర్భం ఉండదు. ఈ నెల 20 న సర్దా ఆడియోను రిలీజ్ చేయబోతున్నామని ఇప్పటికే డిసైడైన ఈ తరుణంలో, చిరు వస్తారా రారా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.
మరోవైపు పవన్ మాత్రం, కేవలం మూవీ టీం, అభిమానులు తప్ప ఇంకెవరూ ఆడియో ఫంక్షన్లో అవసరం లేదని భావిస్తున్నారట. బహిరంగంగా ఫీలింగ్స్ ను వ్యక్తపరచడం పవన్ కు సాధారణంగా ఇష్టం ఉండదు. అందుకే ఇప్పుడు చిరును పిలవనంత మాత్రాన ఆయన మీద ప్రేమ లేనట్టు కాదు అని పవన్ అభిప్రాయం. దీని బట్టి చూస్తే, లాస్ట్ మినిట్ లో ఛేంజెస్ట్ జరిగితే తప్ప సర్దార్ ఆడియో ఫంక్షన్ కు చిరు రానట్టే మరి. మెగా బ్రదర్స్ ను మళ్లీ స్టేజ్ పై కలిసి చూడాలనుకుంటున్న మెగాఫ్యాన్స్ ఆశలు ఎప్పుడు ఫలిస్తాయో చూడాలి.