English | Telugu
సర్దార్ గబ్బర్ సింగ్ కు పాట పాడిన శ్రేయా ఘోషల్
Updated : Mar 5, 2016
పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా టైం కి రిలీజ్ కావాలని, అన్ని డిపార్ట్ మెంట్స్ తోనూ ఉరుకులు పరుగులు పెట్టించి షూట్ ను పూర్తి చేయిస్తున్నారు పవర్ స్టార్. లేటెస్ట్ గా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా పాటల్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. తాజాగా శ్రేయా ఘోషల్ తో ఒక సాంగ్ ను రికార్డ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. రికార్డింగ్ బాగా జరిగింది. శ్రేయా అద్భుతంగా పాడింది. మరి వినడానికి మీరంతా రెడీయేనా అంటూ ట్వీట్ చేశారు దేవీ. కె.యస్ రవీంద్ర డైరెక్ట్ చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కు జతగా కాజల్ నటిస్తోంది.