English | Telugu

కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌ రివ్యూ

సినిమాలో క‌థ అనే వ‌స్తువే లేక‌పోవ‌డం పెద్ద స‌మ‌స్య‌! క‌థ‌లెక్కువైనా ప్రాబ్ల‌మే! అస‌లు క‌థ‌లో ఉప్మాలా ఉప క‌థ‌లు పోటెత్తితే.. ఏది అస‌లో, ఏది కొస‌రో అర్థం కాక త‌ల‌బ‌రువెక్కుద్ది. అదెలాగో.. తెలియాలంటే కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చూడాలి. నిజానికి ఇదో సింపుల్ క‌థ‌. కానీ వీలైనంత కాంప్లికేట్ చేసేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. దాంతో..అస‌లు క‌థ చెట్టెక్కి కూర్చుంది. క్లైమాక్స్ వ‌ర‌కూ కింద‌కి దిగి రాలేదు. ఆ విధంబెట్టిదో తెలియాలి అనిన‌.. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ లోతుల్లోకి వెళ్లాలి.



కథ:

కృష్ణ (నాని)కి చిన్నప్పట్నుంచే మహాలక్ష్మి (మెహ్రీన్)అంటే ఇష్టం. కానీ దాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌లేడు.కార‌ణం.. భ‌యం. మ‌హాల‌క్ష్మిది ఫ్యాక్ష‌న్ కుటుంబం. త‌న మ‌న‌సులోని మాట బ‌య‌టకు చెప్తే ఎక్క‌డ ప్రాణాలు పోతాయో అన్న‌భ‌యం. మ‌హాల‌క్ష్మికీ... కృష్ణ అంటే ప్రాణం. అందుకే.. గుట్టుగా ప్రేమించుకొంటుంటారు. అయితే... ఈ ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టాల్సిన సంద‌ర్భం వ‌స్తుంది. `మా ఇంట్లో వాళ్ల‌కు మ‌న ప్రేమ విష‌యం చెప్ప‌కపోతే... ప్రాణాలు తీసుకొంటా` అని మ‌హాల‌క్ష్మి బెదిరిస్తుంది. దాంతో.. ఎలాగైనా రిస్క్ చేద్దామ‌నుకొంటాడు. ఇంత‌లో..మాఫియా డాన్ డేవిడ్ భాయ్ (మురళీ శర్మ) హైద‌రాబాద్‌కి వ‌స్తాడు. అత‌ని కోస‌మే ఎదురుచూస్తుంటాడు ఏసీపీ శ్రీకాంత్ (సంపత్ రాజ్). అసలు మ‌హాల‌క్ష్మి క‌థ‌కీ, వీళ్లిద్ద‌రికీ ఉన్న సంబంధం ఏమిటి? కృష్ణగాడు త‌న‌లోని వీరుడ్ని ఎలా బ‌య‌ట‌కు తీసుకొచ్చాడు అన్న‌దే.. ఈ సినిమా.

ఎనాలసిస్ :

ఓ పిరికివాడు వీరుడిలా ఎలా మారాడు? త‌న ప్రేమ‌ని ఎలా గెలిపించుకున్నాడు అన్న‌దే క‌థ‌. స్టోరీ సింపుల్‌గా ఉంది. కానీ.. దాంట్లో అనేక‌ానేక పాత్ర‌ల్ని ప్ర‌వేశ పెట్టి, ట్విస్టులు ట‌ర్న్‌ల‌తో హోరెత్తించి, ఛేజింగులు ఫైటింగులు గ‌ట్రా చేసి... క‌ల‌గాపుల‌గం చేసేశాడు. దాంతో సినిమా అంతా ఒకే థ్రెడ్‌పై సాగ‌కుండా.. ఇష్టంవ‌చ్చిన‌ట్టు నడుస్తుంది. ఏ పాత్ర ఎందుకొచ్చిందో అన్న విష‌యం కామ‌న్ ఆడియ‌న్‌కి అంత త్వ‌ర‌గా రిజిస్ట‌ర్ అవ్వ‌దు. కానీ.. కృష్ణ‌, మ‌హాల‌క్ష్మి ల‌వ్ ఎపిసోడ్ ఇంట్ర‌స్టింగ్ గా సాగుతుంది. ఆ దాగుడు మూత‌ల ప్రేమ‌క‌థ‌, మ‌ధ్య‌లో స‌త్యం రాజేష్‌ని బ‌క‌రాగా మార్చుకోవ‌డం, కృష్ణ‌గాడి పిరికిత‌నం...ఇవ‌న్నీ జనాలకు న‌చ్చుతాయి. అయితే..అందులో ఫ్యాక్ష‌న్ గోల ఎక్కువైంది. ముఠా త‌గాదాలు, న‌రుక్కోవ‌డాలూ పెరిగి.. ప్రేమ‌క‌థ‌లో ర‌క్త‌పాతం ప్ర‌వేశిస్తుంది. పిల్ల‌ల్ని కాపాడే బాధ్య‌త హీరోపై ప‌డ‌డం.. సినిమాకి కీల‌క‌మైన ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌. అక్క‌డి వ‌ర‌కూ.. క‌థ బాగానే ఉన్న‌ట్టు అనిపిస్తుంది. అయితే ఆ త‌ర‌వాతే పూర్తిగా ట్రాక్ త‌ప్పుతుంది. క‌థ‌తో పాటు,.. సినిమా కూడా రోడ్డుపైన ప‌డుతుంది. పిల్ల‌ల్ని కాపాడ‌డం సీరియ‌స్ బాధ్య‌త‌. కానీ.. హీరో దాన్ని సిల్లీగా తీసుకోవ‌డం న‌చ్చ‌దు. అప్ప‌టి వ‌ర‌కూ ఏసీపీ శ్రీ‌కాంత్‌కి ఎదురే లేద‌న్న‌ట్టు చూపిస్తారు. కానీ.. త‌న పిల్ల‌ల్ని తాను కాపాడుకోలేడు. బ‌లం.. బ‌ల‌గం ఉన్నా ఆ పాత్ర‌ని డ‌మ్మీ చేసేశారు. సెకండాఫ్‌లో ఫృద్వీ పోలీస్ స్టేష‌న్ ఎపిసోడ్ త‌ప్ప‌.. ఇంకేం పేల్లేదు. హీరో హీరోయిన్ల పాత్ర‌కూ సెకండాఫ్‌లో ప్రాధాన్యం త‌గ్గిపోయింది. సినిమాని ఏదోలా న‌డిపించాల‌ని కాస్త క‌న్‌ఫ్యూజ‌న్ కామెడీనీ క‌లిపేశారు. లారీపై సాగే పాట కూడా ఇరికించేదే. క్లైమాక్స్ వ‌ర‌కూ.. నానిలో ని హీరో మేల్కోడు. దాంతో.. సెకండాఫ్ మొత్తం శిరోభారంగా మిగిలిపోతుంది.

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

భ‌లే భ‌లే మ‌గాడివోయ్ హ్యాంగోవ‌ర్‌లోనే నాని ఉండిపోయాడేమో అనిపిస్తుంది. అవే ఎక్స్‌ప్రెష‌న్స్ మ‌ళ్లీ రిపీట్ చేశాడు. మొత్తానికి త‌న వంతు బాధ్య‌త‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించాడ‌ు. మెహ‌రీన్ అందంగా క‌నిపించింది. అయితే.. మ‌హాల‌క్ష్మి పాత్ర‌కు అంత సూట‌బుల్ కాద‌నే చెప్పాలి. సెకండాఫ్‌లో త‌న రోల్ చాలా త‌క్కువ‌. సంపత్ రాజ్‌కి మ‌రోసారి మంచి పాత్ర ద‌క్కింది. ముర‌ళీ శ‌ర్మ‌ని డాన్‌గా చూపించి... ఆ పాత్ర‌ని చివ‌రికి క‌ట‌క‌టాల వెన‌క్కే ప‌రిమితం చేశారు. ఫృద్వీ, స‌త్యం రాజేష్‌లు కాస్త రిలీఫ్ ఇచ్చారు.

అందాల రాక్ష‌సి సినిమా ఎలా ఉన్నా.. టెక్నీషియ‌న్‌గా మంచి పేరు తెచ్చుకొన్నాడు. హ‌ను. ఈ సినిమాలో మాత్రం.. ర‌చ‌యిత‌గా పేరు రావాల‌న్న త‌ప‌న చూపించాడు. డైలాగ్స్ అక్క‌డ‌క్క‌డ బాగున్నాయి. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ని బాగానే హ్యాండిల్ చేశాడు. అయితే క‌థ విష‌యంలో ట్రాక్ త‌ప్పేశాడు. నువ్వంటే.. పాట చాలా బాగుంది. తీర్చిదిద్దిన విదాన‌మూ న‌చ్చుతుంది. మిగిలిన పాట‌ల‌న్నీ క‌థ‌కు స్పీడ్ బ్రేక‌ర్లు వేసేవే. నిడివి కూడా బాగా టూమ‌చ్‌గా ఉంది. 20 నిమిషాల సినిమా ట్రిమ్ చేసుకోవ‌చ్చు. విజువ‌ల్‌గా సినిమా బాగుంది. కానీ.. సినిమాలోనే విష‌యం లేదు.

మొత్తానికి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ త‌ర‌వాత‌.. నాని నుంచి వ‌చ్చిన సినిమా కాబ‌ట్టి ఓపెనింగ్స్ బాగుండొచ్చు. కానీ లాంగ్ ర‌న్ క‌ష్ట‌మే. కృష్న‌గాడిలో వీర‌త్వ‌మూ, ప్రేమ‌త్వ‌మూ రెండూ పూర్తిగా నిల్‌.. అయిన క‌థ ఇది.

రేటింగ్‌:
2.5

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.