English | Telugu
సర్దార్ గబ్బర్ సింగ్.. ఏపీ పోలీసా? తెలంగాణ పోలీసా?
Updated : Oct 19, 2015
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటింటిన గబ్బర్ సింగ్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే సీక్వెల్ లో వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కూడా ఆ రేంజ్ లో హిట్ అవ్వాలని పూర్తి కాన్సట్రేషన్ పెట్టారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. అయితే అంతా బానే ఉన్నా ఇప్పుడు ఈ సినిమాలో పవన్ గెటప్ పై తెగ చర్చ జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ గెటప్ ఏంటీ.. ఆసినిమాలో లాగ ఈ సినిమాలో కూడా పోలీస్ గెటప్పే అనుకుంటున్నారు కదా. అదే ఆ పోలీసు దగ్గరే అసలు వ్యవహారం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తీసినప్పుడు రాష్ట్ర విభజన జరగలేదు. సో.. ఆసినిమాలో భాష కాని యాస కాని అచ్చం ఆంధ్రా పోలీసు మాదిరే ఉంటుంది. అయితే ఇప్పుడు అలా కాదు.. పరిస్థితి వేరు.. రాష్ట్ర విభజన జరగడంతో.. ఈ సినిమాలో పవన్ ఏపీ పోలీసుగా నటిస్తారా? లేక తెలంగాణ పోలీసుగా నటిస్తారా?అని ఒకటే చర్చ.
అయితే పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ఆలోచించి అటు తెలంగాణ, ఆంధ్రా కలిసిన పోలీసుగా దర్శనమివ్వబోతున్నాడట. షర్ట్ బటన్ విప్పి, బనియన్ కనిపిస్తూ తెలంగాణ యాసలో కొంచం సేపు.. ఏపీ యాసలో కొంచం సేపు మాట్లాడతాడట. అంతేకాదు గబ్బర్ సింగ్ సినిమాలో గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ మాదిరి ఈ సినిమాలో రత్తన్ పూర్ పోలీస్ స్టేషన్ పేరు పెట్టాడట. మొత్తానికి పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ఆలోచించారు కాని ఆ ప్లాన్ వర్కవుట్ అవుద్దో లేదో చూడాలి.