English | Telugu

పాపం అన్నీ మూడో హీరోయిన్ ఛాన్సులేనా?

యువత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తార అక్ష. చక్కని అందం, అభినయం ఉన్న అక్ష పదహారణాల తెలుగు పిల్లాల.. మన పక్కింటి అమ్మాయిల అనిపిస్తుంది. అయితే ఎంత అంద ఉన్నా లక్ అనేది కలిసిరాకపోతే అది కాస్త వేస్ట్ అయిపోనట్టే. ఈ అమ్మడి పరిస్థితి కూడా అంతే. యువత సినిమాలో నటించి ఆతరువాత "కందరీగ"లో సెంకడ్ హీరోయిన్ గా చేసి హిట్ అందుకున్నా.. తరువాత చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏం వరించలేదు. ఏదో చిన్నా చితకా సినిమాలు చేసినా అవి కూడా సరిగా ఆడగపోవడంతో దాదాపు చాలాకాలం నుండి తెలుగు తెరకి దూరమైంది. అయితే ఇప్పుడు మళ్లీ కొన్ని ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకొని రీఎంట్రీ ఇవ్వనుంది. విచిత్రం ఏంటంటే ఆ సినిమాల్లో కూడా మూడో హీరోయిన్ గా మాత్రమే ఛాన్స్ దక్కింది. బాలకృష్ణ హీరోగా వస్తున్న "డిక్టేటర్" సినిమాలో అంజలి - సోనాల్ చౌహాన్ హీరోయిన్లు కాగా అక్ష మూడో హీరోయిన్ గా నటిస్తోంది. ఇవి కాక రవితేజ "బెంగాల్ టైగర్" సినిమాలో కూడా ఇప్పటికే తమన్నా, రాశీఖన్నా ఇద్దరు హీరోయిన్లు కాగ అక్ష మూడో హీరోయిన్ గా నటిస్తోంది. పాపం మొత్తానికి ఛాన్సులు వస్తున్నా కానీ అవి కూడా మూడో హీరోయిన్ గా ఛాన్సులు వస్తుంటే ఇక మూడో హీరోయిన్ గానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది ఈ బొద్దుగుమ్మ..

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.