English | Telugu

పవర్ స్టార్ జైలుకు వెళ్తాడట..!!

పవన్‌ కళ్యాణ్‌ కి ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ వేసిన జోక్స్ కి కోపం వచ్చిందో ఏమో తెలియదు గానీ, మొన్న ప్రెస్‌మీట్‌లో తాను చేసిన విమర్శలకు రాజకీయ నాయకులు మండిపడిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ట్విట్టర్ ద్వార పవన్ వారి విమర్శలకు సమాధానమిచ్చారు. మీడియా సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలపై పలువురు ఫిర్యాదులు.. కేసులు పెడుతున్నారని.. జైళ్లు.. కోర్టులు ఎదుర్కొనటానికి సంతోషంగా ఎదురుచూస్తానని.. ఆ పనేదో త్వరగా చేయాలన్నట్లుగా ఆయన ట్వీట్‌ చేశారు.

"సీమాంధ్ర ఎంపీలు పౌరషం నామీద కాదు.. కేంద్రం మీద చూపించండి” అంటూ తొలి పంచ్‌ ఇచ్చిన పవన్‌.. ఆ తర్వాత ”నన్ను తిడితే ప్రత్యేక హోదా రాదు” అంటూ మరో ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ముచ్చటగా మూడో ట్వీట్‌లో.. ”ఎంపీలు వ్యాపారాలు చేయడం తప్పు కాదు.. ‘వ్యాపారాలు’ మాత్రమే చేయడం తప్పు” అంటూ సెటైర్‌ వేశారు. ఐతే ఇంతకుముందులా సైలెంటైపోకుండా.. పవన్‌ వెంటనే ఈ విమర్శలపై స్పందించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.