English | Telugu

బన్నీకి పడిపోయిన కొత్తపోరి

మెగా హీరో వరుణ్‌ తేజ్‌కు జంటగా నటించబోతున్న దిశా పటాని బన్నీని తెగ పోగిడేస్తోంది. ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ... తన హీరో వరుణ్‌ ఊసు ఎత్తలేదు. మెగా ఫ్యామిలీలో ఉన్న మిగతా పెద్ద హీరోల గురించీ మాట్లాడలేదు. కానీ బన్నీ అంటే మాత్రం తనకు చచ్చేంత ఇష్టమని చెబుతోంది.

"అల్లు అర్జున్‌ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అతడికి నేను పెద్ద ఫ్యాన్‌. బన్నీ డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ చూస్తే నాకు మతి పోతుంది. ఆయనతో కలిసి ఒక్క సినిమా చేయాలన్నది నా లక్ష్యం. తన పక్కన హీరోయిన్‌గా ఛాన్స్‌ రాకపోయినా పర్వాలేదు. కనీసం బన్నీతో కలిసి ఒక పాటలో డ్యాన్స్‌ చేసినా నాకు సంతోషమే” అని చెప్పింది దియా.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వరుణ్‌ హీరోగా తెరకెక్కే సినిమా కోసం దిశా పటాని హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. పూరితో ఇంతకుముందే ఓ సినిమా చేయాల్సిందని.. కానీ అనుకోకుండా ఆ అవకాశం తప్పిందని చెప్పింది దిశా. రెండేళ్ల కిందట మోడలింగ్‌లో అడుగుపెట్టిన దిశా.. టైగర్‌ ష్రాఫ్‌తో ‘బాగీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తెలుగు నటుడు సుధీర్‌ బాబు విలన్‌ క్యారెక్టర్‌ చేస్తుండటం విశేషం.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.