English | Telugu
ముకుందలో పవన్ కళ్యాణ్?
Updated : Dec 18, 2014
మెగా హీరో వరుణ్ తేజ్ ముకుంద సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా బయటకువస్తున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. వరుణ్ తేజ్ కి మంచి ఓపెనింగ్స్ తెప్పించాలని ఈ చిత్ర బృందం సినిమాలో ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తోంది. అందేంటంటే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ సన్నివేశంలో అలా మెరిసి, ఇలా మాయమవుతాడట. ఈ సన్నివేశాన్ని రీసెంట్ గా చిత్రీకరించి సినిమాలో యాడ్ చేసినట్లు సమాచారం. అంతేకాదు దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఓ సీన్ లో తళుక్కున మెరుస్తారని టాలీవుడ్ బోగట్టా. మొత్తానికి ముకుందలో సమ్ థింగ్ స్పెషల్ విషయాలు చాలానే ఉన్నాయ్.