English | Telugu

గ‌బ్బ‌ర్ సింగ్ 2 డైరెక్ట‌ర్ మారాడోచ్‌!



ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్ 2. ర‌చ్చ త‌ర‌వాత సంప‌త్‌నంది సైన్ చేసిన సినిమా ఇదే. ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలిచి మ‌రీ ఛాన్స్ ఇచ్చాడ‌ని చెప్పుకొన్నారు. ఇప్ప‌డు సంప‌త్‌నంది స్థానంలో మ‌రో ద‌ర్శ‌కుడొచ్చాడు. త‌నే... బాబి. బ‌లుపుకి ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన బాబి, ఆ త‌ర‌వాత ప‌వ‌ర్‌కి మెగా ఫోన్ ప‌ట్టాడు. ఇప్పుడు మెగా హీరోతో సినిమా చేసే ఛాన్స్ అందుకొన్నాడ‌న్న‌మాట‌. నిర్మాత శ‌ర‌త్‌మ‌రార్‌కి బాబి ప‌నిత‌నం బాగా న‌చ్చింద‌ట‌. ప‌వ‌ర్ సినిమా చూసి శ‌ర‌త్ మ‌రార్ ఫుల్ ఖుషీ అయ్యార‌ట‌. ఆయ‌నే ప‌వ‌న్‌కు బాబీ పేరు సూచించార‌ని టాక్‌. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వ‌ర్ సినిమా చూశార‌ని, దాంతో బాబీ పేరు క‌న్‌ఫామ్ అయిపోయింద‌ని చెప్పుకొంటున్నారు. డిసెంబ‌రులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.