English | Telugu

21 దేశాలకు షాక్ ఇస్తున్న స‌న్నీలియోన్‌


సన్నీలియోన్ ఎంట్రీ...మంచు సినిమా జాత‌కాన్నే మార్చేసింది. స‌న్నీలియోన్ తెలుగులో తొలిసారి న‌టించిన చిత్రం క‌రెంటు తీగ‌. మంచు మ‌నోజ్ క‌థానాయ‌కుడు. ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 21 దేశాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది చిత్ర‌బృందం. అదంతా స‌న్నీ క్రేజ్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. సాధార‌ణంగా మంచు కుటుంబ చిత్రాలు యు.ఎస్‌కే ప‌రిమిత‌మ‌వుతాయి. కానీ ఇందులో స‌న్నీ కూడా ఉంది క‌దా..?? అందుకే 21 దేశాలకు షాక్ ఇవ్వ‌బోతోంది ఈ క‌రెంటు తీగ‌. ఆస్ట్రేలియా, యుకె, మ‌లేసియా, షార్జా, ఒమ‌న్‌, కువైట్‌, ఖత్త‌ర్, కెన‌డా, ఉగాండా... ఇలా ఈ లిస్టులో 21 దేశాలున్నాయి. స‌న్నీ లియోనా, మ‌జాకా...??

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.