English | Telugu
జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ కు పవన్ కాంప్లిమెంట్..!
Updated : Apr 11, 2016
పవన్ కల్యాణ్ అంటే జనం ఎందుకంత అభిమానిస్తారో మరో సారి అర్థమైంది. పవన్ లోని నిజాయతీ, నిజాన్ని ఒప్పుకొనే తీరు మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచింది.మొన్నటికి మొన్న అన్న నందమూరి తారక రామారావులాంటి ఇమేజ్ ఎవ్వరికీ సాధ్యం కాదని, సినీ రాజకీయ రంగాల్లో ఆయనకు తిరుగులేదని నిక్కచ్చిగా నిజం ఒప్పుకొన్న పవన్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కీర్తించాడు. ఎన్టీఆర్ డాన్స్ అద్భుతమని, తనలా నన్నూ డాన్స్ చేయమంటే ఎలా?? అంటూ ప్రశ్నించి అందరికీ షాక్ ఇచ్చాడు.
ఓ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ.. ''నాకు డాన్స్ అంతగా రాదు. వచ్చిన నాలుగైదు స్టెప్పులే మళ్లీ మళ్లీ వేస్తుంటా. అలాంటి నా దగ్గరకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్‌లా డాన్స్ చేయమంటే ఎలా..? నాకంత ప్రతిభ లేదు..'' అంటూ మరోసారి తనకు ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేవన్న విషయాన్ని చాటి చెప్పాడు. ఓ హీరో.. మరో హీరోతో పోల్చుకొని తనని తాను చిన్నబుచ్చుకోవడం.. టాలీవుడ్‌లో ఎవరికి సాధ్యం..? ఒకరి గొప్పదనాన్ని ఒప్పుకొని తనకంటే నేను తక్కువ అని చెప్పుకోవడం.. ఈగోల్ని విడచి.. మాట్లాడడం ఒక్క పవన్ కళ్యాణ్ కే సాధ్యం. పవన్ కామెంట్లు ఇటు మెగా అభిమానుల్ని, అటు ఎన్టీఆర్ అభిమానుల్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. పవన్‌ని చూసి మిగిలిన హీరోలూ కాస్త ఈగోల్ని వదిలి ఇలా నిజాలు మాట్లాడితే మంచిదన్న టాక్ అప్పుడే బయల్దేరిపోయింది. ఈ విషయంలో పవన్ అందరికీ ఆదర్శం కావాలని కోరుకొందాం.