English | Telugu

ఎవరు ఈ సుజిత్ రెడ్డి 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)సిల్వర్ స్క్రీన్ పై మరోమారు తన మానియాని ప్రదర్శించడానికి 'ఓజి'(OG)తో సిద్ధమవుతున్నాడు. 1980 , 90 వ దశకం నేపథ్యంలో గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్' లో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చెయ్యడంతో, అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ మూవీకి 'సుజిత్' దర్శకుడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుజిత్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతు సుజిత్ నా అభిమాని. 'జానీ' సినిమా చూసీ అందులో నేను కట్టుకున్నట్టుగా 'హెడ్ బ్యాండ్' కట్టుకొని నెలరోజుల పాటు అలాగే ఉంటే, వాళ్ళ అమ్మ గారు తిట్టారు. అలాంటి అభిమాని నాతో ఓజి చేసాడు. ఈ మూవీకి స్టార్ నేను కాదు, సుజిత్ అని చెప్పుకొచ్చాడు. దీంతో సుజిత్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది.

సుజిత్(Sujeeth)అసలు పేరు 'సుజిత్ రెడ్డి'. ఏపి లోని అనంతపురంకి చెందిన సుజిత్ రెడ్డి పదిహేడు సంవత్సరాల వయసు నుంచే షార్ట్ ఫిల్మ్స్ ని చెయ్యడం ప్రారంభించాడు. ఇలా సుమారు ముప్పై షార్ట్ ఫిల్మ్స్ వరకు సుజిత్ దర్శకత్వంలో వచ్చాయి. ప్రముఖ మీడియా ఛానల్ 'తెలుగు వన్' లో కూడా వర్క్ చేసాడు. చెన్నై లోని ఎల్ వి ప్రసాద్ ఫిలిం అండ్ టివి అకాడమీ లో కోర్స్ చేసి పట్టా కూడా పొందిన సుజిత్ 2014 లో 'యువి క్రియేషన్స్' నిర్మాణ సారధ్యంలో శర్వానంద్ తో 'రన్ రాజా రన్ తో తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చాడు. స్టైలిస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతి షాట్ ని అంతే, స్టైలిస్ట్ గా తెరకెక్కించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. మూవీ కూడా ఘన విజయం సాధించడంతో యువి క్రియేషన్స్ ద్వారా ప్రభాస్ కి 'సాహూ' కథ చెప్పాడు.

2019 లో రిలీజైన 'సాహూ' ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించి తన కంటు ఒక బ్రాండ్ ని సృష్టించుకున్నాడు. ఎవరి ఊహలకి అందని విధంగా సుజిత్ సినిమాలోని క్యారెక్టర్స్ స్క్రీన్ పై కదులుతాయి. స్క్రీన్ ప్లే కూడా ఎంతో వేగంగా కదులుతుంది. అందుకే సుజిత్ కి పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చాడు. దీంతో సెప్టెంబర్ 25 న 'ఓజి' ద్వారా సుజిత్ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. సుజిత్ కి 'ఓజి' మూడవ చిత్రం. కథకి తగ్గ టేకింగ్ 'సుజిత్' ప్రధాన బలం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.