English | Telugu

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. వాటిని తొలిగించింది నిజం 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu). నిధి అగర్వాల్(Nidhhi Agerwal)హీరోయిన్ గా చేస్తుండగా బాబీడియోల్, సత్యరాజ్,నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, జిష్ణు సేన్ గుప్తా, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మెగా సూర్య పతాకంపై ఏఎం రత్నం,దయాకర్ సుమారు రెండు వందల కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. కీరవాణి(Keeravani)సంగీత దర్శకుడుగా వ్యవహరించగా క్రిష్(Krish), జ్యోతికృష్ణ(Jyothi Krishna)ద్వయం దర్శకత్వం వహించింది.

ఈ మూవీ నుంచి నాలుగో సాంగ్ తార, తార(Tara Tara)అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ నిది అగర్వాల్ పై చిత్రీకరించగా, ఇది పక్కా ఐటెం సాంగ్ అని లిరిక్ తో పాటు వీడియో చూస్తే తెలుస్తుంది. కానీ సాంగ్ లో ఎక్కడ కూడా శృతి మించి అసభ్య పదజాలాలు లేవు. దీంతో ఈ సాంగ్ విన్న చాలా మంది గతంలో కీరవాణి మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుంటున్నారు. వీరమల్లు మూడో సాంగ్ కి సంబంధించిన ఈవెంట్ లో కీరవాణి మాట్లాడుతు నాలుగో సాంగ్ 'తార తార' అనే ఒక ఐటెం సాంగ్ త్వరలోనే రిలీజ్ కానుంది. లిరిక్ లో కొన్ని పదాలు శృతి మించి ఉన్నాయి. దాంతో పవన్ సదరు లిరిక్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి నేనిప్పుడు డిప్యూటీ సిఎంగా ఉన్నాను. అసభ్య పదాలని ఉపయోగిస్తే బాగోదని కొన్ని పదాలని తొలగించాడనే విషయాన్నీ చెప్పాడు. ఇప్పుడు ఆ మాటని అందరు గుర్తు చేసుకుంటున్నారు.

హరిహర వీరమల్లు జూన్ 12 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ లో వేగం పెరగనున్నాయి. అందులో భాగంగా రీసెంట్ గా చెన్నై లో ఈవెంట్ జరుగగా చిత్ర బృందం మొత్తం పాల్గొంది. పవన్ కూడా త్వరలోనే వీరమల్లు ఈవెంట్స్ కి హాజరవుతాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.


అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.