English | Telugu
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పై రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు
Updated : May 28, 2025
కామెడీ కింగ్, నటకిరీటి రాజేంద్రప్రసాద్(Rajendraprasad)ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ 'షష్టిపూర్తి'(Shashtipoorthi). మే 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్, అచ్యుత్ కుమార్, మురళిదర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తల్లితండ్రుల పెళ్లిని వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు చూడలేరు. కానీ తల్లి తండ్రుల పెళ్లి చూడటానికి పిల్లలకి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం పేరే షష్టి పూర్తి. ఈ పాయింట్ తోనే 'షష్టిపూర్తి' మూవీ తెరకెక్కింది. ఇళయరాజా(ilaiyaraaja)సంగీత దర్శకత్వంలో పవన్ ప్రభ (Pavan Prabha)దర్శకత్వం వహించగా రూపేష్ నిర్మాతగా వ్యవహరించాడు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. మూవీకి సంబంధించిన పలు విషయాలతో పాటు, థియేటర్ల బంద్ అంశంపై పవన్ తీసుకున్న నిర్ణయంపై కొంత మంది మీడియా వాళ్ళు రాజేంద్రప్రసాద్ కి ప్రశ్న వెయ్యడం జరిగింది. అప్పుడు ఆయన మాట్లాడుతు థియేటర్స్ బంద్ చేస్తామనే విషయం చిన్నది కాదు. దీన్ని ఎవరో మిస్ గైడ్ చేసారు. ఒకరు చెబితే థియేటర్స్ మూసెయ్యడం జరిగేది కాదు. సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. అందుకే అది నిలబడలేదు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఫీల్ అయ్యాడంటే అది సరైనదే అవుతుంది. తన సినిమా రిలీజ్ కి ముందు ఇలా అంటున్నారేంటనే బాధ ఉంటుంది. పైగా ఉప ముఖ్య మంత్రిగా బాధత్య గల పదవిలో ఉన్నాడు. థియేటర్ మూసివేత అంశం సృష్టించిన వాళ్ళని కనిపెడితే సమస్యకి ఫుల్ స్టాప్ పడుతుంది. పవన్ ఈ విషయంలో బాధ్యత తీసుకొని దాని వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని కోరడం హర్షించదగ్గ విషయమని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
