English | Telugu
'రుద్రమదేవి' లో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్
Updated : Oct 13, 2014
టాలీవుడ్ లో భారీ అంచనాలు వున్న ప్రాజెక్ట్ లలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రుద్రమదేవి' ఒకటి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్లో బిజీగా వున్న డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమా పబ్లిసిటీపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు షూటింగ్ కూడా కంప్లీట్ కావడంతో ఈ సినిమా ప్రొమోషన్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నాడట. దీనిలో భాగంగా ఈ నెల 18న అల్లు అర్జున్ గోనగన్నారెడ్డిని గెటప్ ను బయటకు రిలీజ్ చేస్తారట. దీంతో తమ అభిమాన హీరో లుక్ ఎలా వుంటుందనే దానిపై అభిమానుల్లో క్యూరియోసిటీ నెలకొంది. అయితే ఈ సినిమాపై బన్నీ అంచనాలు పెంచుతాడా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..!!