English | Telugu
రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పవన్ పార్టీ
Updated : Mar 14, 2016
"పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం'' అంటూ 2014 మార్చి 14వ తేదీన పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన పార్టీ’ నేటితో సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పార్టీతో ఇంతవరకు పోటీ చేయలేదు. పైగా ఇతర పార్టీల తరుపున ప్రచారంచేశాడు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లకు తన మద్దతు ప్రకటించడమే కాకుండా గత ఎలక్షన్ లో ఈ రెండు పార్టీలు విజయం సాధించడానికి మూల కారణంగా నిలిచాడు పవన్ కళ్యాణ్. సినిమా తారల్లో పార్టీ స్థాపించిన తర్వాత ఇలా చేసిన వారు ప్రపంచంలో ఎవరూ లేరనే చెప్పాలి. కాగా ఇటీవలే అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రస్తుతం నేను కమిటైన సినిమాలు 2018 వరకు వున్నాయి.. ఈ సినిమాలు పూర్తిచేసిన వెంటనే కొంత కాలం సినిమాలకు దూరంగా వుంటాను అంటూ... 2019 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో తన రాజకీయ జీవితం వుంటందని చెప్పారు.