English | Telugu

పవన్, మహేష్ కంటే తారక్ బెస్ట్ అంటున్న నాగ్

స్టార్ హీరోల్లో ఎలాంటి భేషజాలకు పోకుండా సింప్లిసిటీని ఇష్టపడే వ్యక్తి ఎవరంటే ముందు గుర్తొచ్చే పేరు కింగ్ నాగార్జున. సినిమా అంటే నాగార్జునకు ప్యాషన్. అందుకే ప్రయోగాత్మక పాత్రలకు కూడా వెనక్కి తగ్గరు. త్వరలో రాబోతున్న ఆయన ఊపిరి సినిమా కూడా నాగ్ కు ప్రయోగమే. నాగార్జున లాంటి ఒక స్టార్ సినిమా అంతా కూర్చీకే అతుక్కుపోయి ఉండే పాత్ర చేయడమంటే మాటలు కాదు. అలాంటి పాత్రలో తనను తాను ఊహించుకోవడానికి గట్స్ కావాలి. అవి నాగ్ కు పుష్కలంగా ఉన్నాయి. ఇంతకూ ఎన్టీఆర్ బెస్ట్ అని ఎందుకన్నాడు అని అడుగుతున్నారా..? అక్కడికే వస్తున్నాం.

ఊపిరి సినిమాను మొదట ఎన్టీఆర్ తో కలిసి చేద్దామని నాగ్ ప్లాన్ చేశాడట. కానీ ఆయనతో డేట్స్ అడ్జెస్ట్ మెంట్స్ కుదరకపోవడంతో, ఆ ఛాన్స్ కార్తీకి వెళ్లిపోయింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ముప్ఫై ఏళ్ల లోపు స్టార్ డం తెచ్చుకోవడం అసాధ్యమని, అది కేవలం ఎన్టీఆర్ కే సాధ్యమైందని వ్యాఖ్యానించారు నాగార్జున. ఆఖరికి పవన్, మహేష్ లు కూడా ముప్ఫై ఏళ్లు దాటిన తర్వాతే స్టార్స్ అయ్యారని ఆయన అన్నారు. అదండీ విషయం. ఇక ఊపిరి సంగతి కొస్తే, ఈ నెల 25న ఊపిరి థియేటర్లకు ఊపిరిలూదబోతోంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో నాగ్, కార్తీ, తమన్నాలు నటించిన ఊపిరి ఫ్రెంచ్ మూవీ ది ఇంటచిబుల్స్ కు రీమేక్

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.