English | Telugu

సర్దార్ ఆడియోకు అన్నయ్యే చీఫ్ గెస్ట్

ఈ నెల 20 వ తేదీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు పవన్ అభిమానులు. ఆ రోజు పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు. చాలా ఏళ్ల తర్వాత, సింగిల్ గా వస్తున్న పవన్ ఫంక్షన్ ను వీలైనంతగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు పవినిస్టులు. ఇప్పటికే సర్దార్ సినిమాను తన అభిమానులకు అంకితమిచ్చేశాడు పవన్. ఆడియో ఫంక్షన్లో కూడా తన ఫ్యాన్స్ మీద ఈగ వాలకూడదంటూ ఆర్డర్స్ జారీ చేశాడట. కేవలం వాళ్ల ఎంజాయ్ మెంట్ కోసమే పవన్ ఆడియో ఫంక్షన్ ను పెడుతున్నాడు.

ఇక చీఫ్ గెస్ట్ గా ఇన్నాళ్లూ మెగాస్టార్ వస్తారా, పవన్ పిలుస్తాడా ఇలాంటి క్వశ్చన్స్ ఫ్యాన్స్ మైండ్ లో ఉన్నాయి. లేటెస్ట్ ఇన్ఫర్ మేషన్ ప్రకారం సర్దార్ ఆడియో ఫంక్షన్లో మెగాబ్రదర్స్ కలిసి కనబడటం కన్ఫామ్ అంటున్నారు. ఈ మధ్య అన్నయ్యకూ, తమ్ముడికీ మధ్య ఉన్న దూరం బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. చిరు 150 వ సినిమా గురించి పవన్ ఆలోచిస్తున్నాడు. సర్దార్ సెట్స్ కు వెళ్లి చిరు పలకరిస్తున్నాడు. సో ఇక దూరం అన్న మాట దూరమైపోయినట్లే. ఇక మార్చి 20 న మెగాభిమానులు పండగ చేసుకోవడమే బ్యాలెన్స్ ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.