English | Telugu

కంప్లీట్ మూవీ రివ్యూ : ' ఊపిరి '

రీమేక్ సినిమా అన‌గానే మ‌నోళ్లు క‌థ‌నీ, క్యారెక్ట‌ర్ల‌నీ, ఆఖ‌రికి డైలాగుల్ని కూడా అచ్చుగుద్దిన‌ట్టు దింపేస్తుంటారు. అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి రైట్స్ కొన్నాం క‌దా, కొత్త‌గా ఆలోచించ‌డం ఎందుకు అనేది వాళ్ల ఉద్దేశం. అంతా బాగానే ఉంది.. కానీ 'ఆత్మ‌' ఎక్క‌డ‌?? అని ఆరా తీస్తే.. అదే మిస్ అవుతుంది. మాతృక‌లో ఉన్న ఫీల్‌... రీమేక్‌లో భూత‌ద్దం పెట్టి వెదికినా క‌నిపించ‌దు. చాలా వ‌ర‌కూ రీమేక్ క‌థ‌లు ప‌ల్టీలు కొట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణం అదే. ఫ్రెంచ్ మూవీ ఇన్‌ట‌చ్‌బుల్ లోనూ కావ‌ల్సినంత ఫీల్ ఉంది. అస‌లు ఆ సినిమాకి ఊపిరే.. ఆ ఫీల్‌. దాన్ని తెలుగులో త‌ర్జుమా చేయ‌గ‌ల‌రా?? ఇన్‌ట‌చ్‌బుల్ లో ఉన్న ఆత్మ‌ని.. తెలుగులో ట‌చ్ చేయ‌గ‌ల‌రా? అనే సందేహాలు ఉండ‌డం స‌హ‌జం. పైగా నాగార్జున లాంటి న‌టుడ్ని వీల్ ఛైర్‌లో కూర్చోబెడితే చూడ‌గ‌ల‌మా? త‌ట్టుకోగ‌ల‌మా? అనే డౌట్లు కోకొల్ల‌లు. మ‌రి... వాటి మ‌ధ్య ఊపిరి వ‌చ్చేసింది. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఊపిరిలో దొరికిందా? ఊపిరికి ఊపిరి ఉందా?? ఆత్మ మిస్ అవ్వ‌కుండా సినిమా తీశారా? చూద్దాం.. రండి.

కథ :

విక్ర‌మాదిత్య (నాగార్జున‌) అప‌ర కుబేరుడు. అన్నీ ఉన్నాయి. కానీ.. లేచి నిల‌బ‌డ‌లేడు. త‌న ప‌నులు తాను చేసుకోలేడు. వీల్ ఛైర్‌లోంచే అన్నీ. అత‌నికో.. సేవ‌కుడు కావాలి. ఆ ప‌నికి కుదురుతాడు శీను (కార్తి). శీను బెయిల్‌పై జైలు నుంచి వ‌చ్చిన వాడు. జాలి లేని మ‌న‌సు. అత‌న్నే ఏరి కోరి ఎంచుకొంటాడు విక్ర‌మాదిత్య‌. ముందు విక్ర‌మ్ ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డం శీనుకి ఇష్టం లేక‌పోయినా... మెల్లిమెల్లిగా 'అన్న‌య్యా'... అంటూ పిలిచేంత ప్రేమ పెంచుకొంటాడు. విక్రమ్‌కీ శ్రీనుకీ మ‌ధ్య అనుబంధం పెరుగుతుంది. శ్రీ‌ను తోడుగా విక్ర‌మ్ ఓ స‌రికొత్త ప్ర‌పంచాన్ని చూడ‌గ‌లుగుతాడు. శ్రీ‌ను ఇంట్లో కొన్ని స‌మ‌స్య‌లుంటాయి. వాటిని విక్ర‌మ్ తొల‌గిస్తాడు. విక్ర‌మ్‌కి ఓ ప్రేమక‌థ ఉంది. ఆ ప్రేమ‌క‌థ‌ని శ్రీ‌ను ఎలా స‌ఫ‌లం చేశాడు? అనేది తెర‌పై చూడాలి.

ఇన్ డిటెయిల్ :

ఇన్‌ట‌చ్‌బుల్ లో ఉన్న పాయింట్‌ని వంశీ పైడి ప‌ల్లి యాజ్ ఇట్ ఈజ్ తీసేశాడు. కొన్ని షాట్స్‌, డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ అన్నీ డిట్టోని. అయితే ఇన్‌ట‌చ్‌బుల్ చూడ‌నివాళ్ల‌కు ఇదో స‌రికొత్త క‌థ‌గానే క‌నిపిస్తుంది. ఫ్రెంచ్ సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి, ఇక్క‌డి భావోద్వేగాల‌కు అనుగుణంగా మ‌ల‌చుకొన్నాడు వంశీ. దాంతో... సినిమాలో ఎక్క‌డా ఫ్రెంచ్ పోక‌డ క‌నిపించ‌దు. మ‌న‌దైన క‌థ చూస్తున్నామ‌న్న భావ‌నే క‌లుగుతుంది. ఎంత బ‌రువైన స‌న్నివేశ‌మైనా.. చివ‌ర్లో హ్యూమ‌ర్ ట‌చ్ ఇచ్చి ముగించాడు. దాంతో... ఫ‌స్టాఫ్ ఆహ్లాద‌క‌రంగా ఆనందంగా సాగిపోతోతుంది. దానికి తోడు కార్తి అద‌ర‌గొట్టేశాడు. త‌న క్యారెక్ట‌ర్‌లోనే బోల్డంత హ్యూమ‌ర్ ఉంది. కార్తి క‌నిపించిన ప్ర‌తీ సీన్ పండిందంటే.. అందులో కార్తి ఎంత‌గా ఒదిగిపోయాడో చెప్పొచ్చు. విక్ర‌మ్‌, శ్రీ‌నుల మ‌ధ్య ఎమోష‌న‌ల్ బాండింగ్ కూడా బాగా చూపించారు. దానికి తోడు.. త‌మ‌న్నా చాలా అందంగా క‌నిపించింది. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ ఎలాంటి బోర్ లేకుండా హాయిగా సాగిపోయింది ఊపిరి ప్ర‌యాణం.

సెకండాఫ్ మాత్రం కాస్త క‌ష్ట‌పెట్టారు. పారిస్ ఎపిసోడ్ భారంగా న‌డుస్తుంది. అక్క‌డ కొత్త‌గా చూపించిందీ, చెప్పిందీ ఏమీ లేదు. కేవ‌లం అనుష్క క్యారెక్ట‌ర్ ఎంట్రీ కోస‌మో.. మ‌రి కొంత నిడివిని పొడిగించ‌డానికో ఆ ఎపిసోడ్ ఉప‌యోగ‌ప‌డింది. ప‌తాక స‌న్నివేశాలు కూడా మ‌రీ ఊహ‌కు అంద‌నంత ఇదిగా ఏమీ లేవు. స‌డ‌న్‌గా సినిమా అయిపోయిందేమో అన్న ఫీలింగ్ కూడా రావొచ్చు. సెకండాఫ్‌ని భ‌రించి.. ఫ‌స్టాఫ్‌లోని అనుభూతిని మూట‌గ‌ట్టుకొని రాగ‌లిగితే.. ఊపిరి సినిమాకి నూటికి అర‌వై మార్కులు వేసేయొచ్చు.

పెర్ఫామెన్స్ :

నాగ్‌, కార్తి ఈ సినిమాకి రెండు ప్ర‌ధాన ఇరుసులు. ఇద్ద‌రూ అద్భుతంగా త‌మ పాత్ర‌ల్ని పండించారు. నాగ్ ఇలాంటి పాత్ర‌లో న‌టించ‌డం సాహ‌స‌మే. కానీ ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌న్న‌ట్టు ఆ పాత్ర‌లో ఒదిగిపోయారు. ఇక కార్తికి మ‌రిన్ని మార్కులు వేసేయొచ్చు. త‌న బాడీలాంగ్వేజ్‌, నిర్లక్ష్య‌మైన చూపులు, ముఖ్యంగా పెయింటింగ్ వేసిన‌ప్పుడు త‌న హావ‌భావాలూ.... సూప‌ర్బ్‌. త‌మ‌న్నాని క‌థానాయిక అని చెప్ప‌లేం. అమె ఓ కీ రోల్ అంతే. అనుష్క‌, శ్రియ అతిథి పాత్ర‌ల్లో మెరిశారు. జ‌య‌సుధ‌, భ‌ర‌ణి, ప్ర‌కాష్‌రాజ్‌... వీళ్లంతా త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర న‌టించారు.

టెక్నికల్ :

సాంకేతికంగా చూస్తే పాట‌లు ఓకే అనిపిస్తాయి. ఐటెమ్ పాట‌లో రావ‌ల్సినంత ఊపు క‌నిపించ‌లేదు. ఆర్‌.ఆర్‌లో మాత్రం గోపీ సుంద‌ర్ ప‌నిత‌నం చూపించాడు. పారిస్ అందాల్ని కెమెరాలో అద్భుతంగా బంధించారు. మాట‌లు ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి. ద‌ర్శ‌కుడిగా వంశీకి ఇదో కొత్త‌ర‌కం సినిమా. సెకండాఫ్ ని ఇంకాస్త బాగా తీర్చిదిద్దితే బాగుండేది.

తెలుగువన్ వ్యూ :

వేస‌వి స‌మ‌యం. పైగా కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమాలేం రావ‌డం లేదు. ఈ సమ‌యంలో ఊపిరి కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ఊపిరినిచ్చేదే. ఈ సినిమాకి పెద్ద‌గా పోటీ లేక‌పోవ‌డంతో బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఢోకా లేక‌పోవొచ్చు. నాగార్జున హ్యాట్రిక్ పై కన్నేయచ్చు.

రేటింగ్‌ : 3/5

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.