English | Telugu

బాలకృష్ణ "ది లెజెండ్" ఇండియా టుడే కథనం

నందమూరి బాలకృష్ణపై ప్రముఖ జర్నల్ ఇండియా టుడే స్పెషల్ కథనాన్ని ప్రచురించింది. వందో సినిమాతో, చాలా తక్కువమందికి మాత్రమే సాధ్యమైన ఘనతను అందుకోబోతున్న బాలయ్య, తండ్రికి తగ్గ తనయుడని, ఎన్టీఆర్ లోని సుగుణాలను పుణికిపుచ్చుకుని నటనలోనూ, రాజకీయాల్లోనూ ఎవరికీ అందనంత వేగంగా దూసుకుపోతున్నారని అభివర్ణించింది. తన తరం హీరోల్లో, అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు, మరోవైపు ప్రజాసేవ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న ఆల్ రౌండర్ హీరో బాలకృష్ణ అంటూ రాసుకొచ్చింది.

ఈ ప్రత్యేక సంచికను ఏపీ సచివాలయంలో, గురువారం చంద్రబాబు ఆవిష్కరించి మొదటి కాపీని బాలయ్యకు అందించారు. ఒకే వ్యక్తి గురించి అన్ని వివరాలూ ఒకే చోట చదవడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది భవిష్యత్ తరాలకు ఒక రిఫరెన్స్ లా ఉపయోగపడుతుంది అన్నారు చంద్రబాబు. అన్ని రంగాల్లోనూ నిష్ణాతులైన వారి మీద ఇలాంటి సంచికలు వస్తే చాలా బాగుంటుంది అన్నారు బాలయ్య. ఆయన గురించి బయటకు తెలియని ఎన్నో కోణాలను ఈ కథనం స్పృశిస్తుందని సమాచారం. బాలయ్య గురించిన అరుదైన ఫోటోలను, విషయాలను ఈ సంచికలో పొందుపరిచారట. గతంలో ఇండియాటుడే కవర్ పైకి తెలుగు హీరోల్లో చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్ మాత్రమే రాగలిగారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి జాయిన్ అయి, తన స్థాయి ఏంటో బాలయ్య చూపించారంటున్నారు నందమూరి అభిమానులు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.