English | Telugu

ఈ ఇండస్ట్రీకేమైంది..? ఊపిరి లాంటి సినిమా వచ్చింది..!

ఊపిరి సినిమా మొదలయ్యిన దగ్గర నుంచి సగటు ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడు నాగార్జున కి కార్తీకి మధ్య గొడవ జరుగుతుందా అని ఎదురు చూశాడంటే అందులో అతని తప్పు ఏమన్నా ఉందా చెప్పండి. అలాగే నాగార్జున యాక్సిడెంట్ వెనక ఏదో ఫ్లాష్ బ్యాక్ వుండి వుంటుంది అనుకోవటం లో గాని, కార్తీ ఆ విలన్లని మట్టుపెడతాడని ఎదురు చూడటం లో కాని తప్పు ఏమన్నా ఉందా? చివరిలో క్లైమాక్స్ ఓ పెద్ద ట్విస్ట్ తో ఉంటుందని ఆశగా స్క్రీన్ వైపు చూడటం లో కూడా తప్పేమీ లేదు కదా .

ఎందుకంటే ఇవన్నీ లేనిదే ఒక తెలుగు సినిమాని ఊహించలేం. అది ఎలాంటి సినిమా అయినా కూడా అందులో ప్రేక్షకుడికి ఊహించని ట్విస్ట్ లు ఉంటేనే అది నిలబడుతుంది అని మన సినీ జనాల నమ్మకం. ఆ నమ్మకం తోనే ఫీల్ గుడ్ మూవీ అని చెబుతూ అందులో ఐదు ఫైట్ లు, నాలుగు ట్విస్ట్ లు, ముగ్గురు విలన్లని పెట్టి మన మీదకి వదులుతారు. ఓహో..ఫీల్ గుడ్ అంటే ఇదేనా అనుకుంటూ మనం సర్దుకు పోయి సినిమా చూసేస్తాం.

అలా మన నమ్మకాల్ని ఒక షేప్ లో ఫిక్స్ చేసారు మనోళ్లు. దానితో ఊపిరి చూసిన సగటు ప్రేక్షకుడు అదేంటి.. ఇదేం సినిమా? ఇద్దరు హీరోలు వున్నా ఒక్క ఫైటూ లేదేంటి? ఒక్క విలనూ లేడేంటి? కనీసం ఇద్దరు హీరోల మధ్యా ఒక్క అభిప్రాయ బేధం కూడా లేదేంటి అని వాపోతాడు. ఏమయ్యిందబ్బా మన తెలుగు ఇండస్ట్రీ కి అని దీర్గాలోచనలో పడతాడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.