English | Telugu
ఊపిరిలో ఎన్టీఆర్ తుస్సుమనేవాడేమో..??
Updated : Mar 26, 2016
రెండేళ్ల క్రిందటి మాట. నాగార్జున - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోందనీ, దానికి వంశీపైడిపల్లి దర్శకుడని తెలిసి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఆనందపడింది. ఇన్‌టచ్‌బుల్స్ సినిమాకి రీమేక్ అన్న టాక్ వచ్చాక అందరూ షాక్ తిన్నారు. ఈ పెద్ద హీరోలిద్దరూ ఏదో మ్యాజిక్ చేస్తారని ఆశించారు. తీరా చూస్తే ఎన్టీఆర్ డ్రాప్ అయ్యాడు. తనకేవో కాల్షీట్ల సమస్యలున్నాయన్న సంగతి ఆ తరవాత తెలిసింది. ఎన్టీఆర్ స్థానంలో కార్తి వచ్చేసరికి మరో షాక్. కార్తికీ ఎన్టీఆర్ కి పోలికేంటి? వీరిద్దరి ఇమేజ్‌లూ వేరు, బాడీ లాంగ్వేజులూ వేరు. పైపెచ్చు కార్తి మన తెలుగువాడు కాదాయె. ఇలా సవాలక్ష డౌట్లు. ఎన్టీఆర్ స్థానాన్ని కార్తి భర్తీ చేయగలడా అనిపించింది. ఊపిరి విడుదలైన అలాంటి అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి.
నాగ్‌ని పొడుతున్న నోళ్లు కార్తిని ఇంకా మెచ్చుకొంటున్నాయి. కార్తి అదరగొట్టేశాడంటూ విమర్శకులూ కితాబు ఇచ్చేస్తున్నారు. శ్రీను పాత్రలో కార్తిని తప్ప మరొకర్ని చూడలేమని తేల్చేస్తున్నారు. మరి ఇదే పాత్ర ఎన్టీఆర్ చేయగలిగేవాడా? ఎన్టీఆర్‌కున్న ఇమేజ్, శ్రీను క్యారెక్టర్ రెండూ చాలా భిన్నమైనవి. ఎన్టీఆర్ గనుక ఉండుంటే తన కోసం, తన స్టార్‌డమ్ కోసం, తన ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని సీన్లు ఇరికించాల్సివచ్చేవి. కార్తి వల్ల ఆ సమస్య రాలేదు. కార్తి వల్లే శ్రీను పాత్రని శ్రీనులానే చూశారు జనాలంతా. కార్తి వల్ల ఈ సినిమాకి మరో ప్లస్సేంటంటే.. తమిళ నాట ఈ సినిమా వసూళ్లకు ఢోకా ఉండదు. అదే ఎన్టీఆర్ అయితే తమిళంలో ఈ సినిమాని చూస్తారా?? మొత్తానికి ఎన్టీఆర్ డ్రాప్ అవ్వడం ఊపిరి సినిమాకి ఊపిరి పోసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం... ఈ నిజాన్ని ఒప్పుకొని తీరాల్సిందే.