English | Telugu
ఓజీ ట్రైలర్ వాయిదా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ కూడా మారింది!
Updated : Sep 16, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ 'ఓజీ' సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి లేనంతగా భారీ హైప్ 'ఓజీ'పై నెలకొంది. విడుదలకు ఇంకా ఎనిమిది రోజులే ఉంది. అయితే ఇంతవరకు ట్రైలర్ విడుదల కాలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా క్లారిటీ లేదు. దీంతో వాటికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. (They Call Him OG)
'ఓజీ' ట్రైలర్ సెప్టెంబర్ 18న విడుదల కానుందంటూ గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు కాస్త ఆలస్యంగా రానుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 20 లేదా 21న రిలీజ్ కానుందని సమాచారం. (OG Trailer)
'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మొదట విజయవాడ అని, తర్వాత వైజాగ్ అని ప్రచారం జరిగింది. కానీ, మేకర్స్ మాత్రం ఫైనల్ గా హైదరాబాద్ లోనే నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. సెప్టెంబర్ 21న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుందని తెలుస్తోంది.
మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ట్రైలర్ ను కూడా విడుదల చేస్తారో లేక ముందు రోజే విడుదల చేస్తారో చూడాలి. ట్రైలర్ రిలీజ్ డేట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన సెప్టెంబర్ 18న వచ్చే అవకాశముంది.