English | Telugu

'ఎన్టీఆర్' తెగ కష్టపడుతున్నాడు

ఎన్టీఆర్ టెంపర్ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడట. ఈ సినిమాను ఎలాగైనా ఈ నెల 25లోపు పూర్తి చేయాలనే పట్టుదలతో వున్నాడట. అసలే ఫుల్ స్పీడ్ లో సినిమాను పూర్తి చేసే పూరికి యంగ్ టైగర్ కూడా తోడుకావడంతో చిత్ర యూనిట్ ను పరుగులు పెట్టిస్తున్నారట. నిన్న ఉదయం నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు కంటిన్యూగా ఓ ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేశారట ఎన్టీఆర్, పూరి. ఇంకా క్లయిమాక్స్, ఓ సాంగ్ పెండింగ్ వున్నాయట. సంక్రాంతి రేస్ ను మిస్సైన ఈ సినిమా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ను వదిలేసుకుంటే, సినిమా బిజినెస్ టార్గెట్ రీచ్ కావడం కష్టమవుతుందని భావిస్తున్నారట. దీంతో ఈ సినిమాను ఫిబ్రవరి 5న పక్కాగా రిలీజ్ చేసేందుకు ఎన్టీఆర్, పూరి తెగ కష్టపడుతున్నారు.