English | Telugu
ఇలియానా డేటింగ్ కి వెళ్తే...?!
Updated : Jan 19, 2015
డేటింగ్ గురించి అడగాలంటే హీరోయిన్లనే అడగాలి. అందులోనూ బాలీవుడ్ గాలి తగిలిన ఇలియానా లాంటివాళ్లని అడిగితే ఇంకా బాగా చెప్తారు. ఇలియానా ప్రేమలో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ ఆస్ట్రేలియన్ దేశస్దుడితో ఇలియానా గత రెండేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. అందుకే డేటింగ్ కి వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లాలి?? అనే విషయంపై కొన్ని సలహాలిస్తోంది. డేటింగ్‌కి బీచ్ అయితేనే బెటరట. అక్కడ ఇసుకలో పడుకొని.. ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెడుతూ కబుర్లు చెప్పుకొంటే హాయిగా ఉంటుంది అంటోంది. అంతేనా...?? మధ్య మధ్యలో వైన్ కూడా రుచి చూస్తుండాలట. ఊరికి, మనకు తెలిసిన ప్రదేశాలకూ దూరంగానే డేటింగ్ స్పాట్ ఎంచుకోవాలట. మనకు తెలియని మనుషుల మధ్య మనం ఇంకా స్వేచ్ఛగా ప్రవర్తిస్తామంటోంది ఇలియానా. చలిమంట కాచుకోవడానికి అనువైన ప్రదేశమై ఉండాలట. అర్థరాత్రి వరకూ చలిమంట కాచుకొంటూ... కబుర్లు చెప్పుకొంటూ.. గడిపేయాలట. అప్పుడే డేటింగ్ లో పరిపూర్ణమైన మజా అనుభవించవచ్చని చెబుతోంది ఇలియానా. ఇదంతా స్వీయ అనుభవం కాకపోతే మరేంటి..?? ఇల్లూ.. ఈ డేటింగులకు పుల్ స్టాప్ పెట్టి, ఇకనైనా పెళ్లిచేసుకోమ్మా.. ఓ పనైపోతుంది.