English | Telugu
ఎన్టీఆర్ కుమ్మి అవతల పడేశాడు!
Updated : Feb 11, 2015
టెంపర్ ఎలా ఉండబోతోంది..?? అందులో ఎన్టీఆర్ డాన్సులు ఎలా చేశాడు..??? సిక్స్ ప్యాక్ లో ఎలా కనిపించాడు??? ఫైట్లు, యాక్షన్ ఎలా ఉంది??? టెంపర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఇలాంటి ప్రశ్నలే చుట్టుముడుతున్నాయి. టెంపర్ సెన్సార్ కూడా పూర్తయ్యింది. సెన్సార్ రిపోర్ట్ ఈ సినిమాకి పాజిటీవ్ గా వచ్చింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అన్న రిపోర్ట్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ డాన్సుల్లో అదరగొట్టేశాడట. టాలీవుడ్ హీరోల్లో తానే నెంబర్ వన్ డాన్సరని ఈ సినిమాతో మరోసారి ఎన్టీఆర్ నిరూపించుకోబోతున్నాడని టాక్. డాన్సులొక్కటే కాదు... ఎమోషన్స్ సీన్స్‌లో ఎన్టీఆర్ పీక్స్ చూపించాడట. సినిమా అంతా తన చుట్టూ తిప్పుకొన్నాడని, తెరపై ఎంతమంది ఉన్నా అందరినీ డామినేట్ చేసేశాడని చెబుతున్నారు. ఈ సినిమాలో ఎనర్జీ లెవిల్స్ చూసి... అందరూ అమ్మో అనాల్సిందేనట. మొత్తానికి ఎన్టీఆర్ టెంపర్ సినిమాని కుమ్మి అవతల పాడేశాడు! ఓ కొత్త ఎన్టీఆర్‌ని... హిట్టు కొట్టిన ఎన్టీఆర్‌ని ఈ సినిమాలో చూడొచ్చన భరోసా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో క్షణ క్షణానికీ పెరిగిపోతోంది. ఇంకెంత....??? మరో రెండు రోజులు ఆగితే చాలు. ఎన్టీఆర్ విశ్వరూపం చూడొచ్చు.