English | Telugu

తాప్సి... తొమ్మిదో త‌ర‌గ‌తి ప్రేమాయ‌ణం!

ప్రేమ, పెళ్లి ఇలాంటి వ్య‌వ‌హారాల్లో క‌థానాయిక‌లు అంత తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌రు. ప్రేమ‌లో ప‌డ్డారా...?? అని అడిగితే 'ప్రేమా లేదూ.. దోమా లేదు' అని న‌వ్వేస్తారు. పెళ్లి మాటెత్తితే.. అప్పుడేనా అంటూ పారిపోతారు. కానీ తాప్సి కి కాస్త స్పీడెక్కువ‌. ఏ విష‌యంలో నైనా ఇంతే దూకుడు చూపిస్తుంటుంది. ప్రేమ విష‌యంలోనూ తాప్పి ఇంతే స్పీడు చూపించింది. త‌న చిన‌నాటి ప్రేమాయ‌ణం గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. త‌ను తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌ద‌వేట‌ప్పుడే ప్రేమ‌లో ప‌డిపోయింద‌ట‌. కానీ... ఆ అబ్బాయి మాత్రం తాప్సిని ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ట‌. దాంతో తాప్సి చాలా హ‌ర్ట‌యిపోయిందట‌. ఈసారి ప్రేమిస్తే... ఫెయిల్ కాకూడ‌ద‌ని ఆనాడే ఫిక్స‌య్యింద‌ట‌. అందుకే ప్రేమ విష‌యంలో తాను చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాన‌ని, స‌రైన వ్య‌క్తిని చూసుకొనే ప్రేమిస్తాన‌ని అంటోంది. ''ఒక విధంగా నాది ఫెయిల్యూర్ ల‌వ్ స్టోరీ. ప్రేమ విష‌యంలో చిన్న‌ప్పుడే నా ఇగో హ‌ర్ట‌య్యింది. అందుకే ప్రేమించి ఎవ‌రిపైనైనా రివేంజ్ తీర్చుకోవాల‌నుకొంటున్నా..'' అంటోంది.