English | Telugu
ఎ-1 స్టార్ యన్ టి ఆర్ 'శక్తి' కథ ఇదేనా...?
Updated : Mar 5, 2011
యన్ టి ఆర్ "శక్తి" చిత్రం కథ ఇదేనా అంటూ మా విలేఖరికి ఫిలిం నగర్ లో ఎవరో అనుకుంటున్న మాటలను బట్టి "శక్తి" కథను ఇదే అయ్యుండొచ్చు అని వ్రాయటం వలన మాకు వైజయంతీ మూవీస్ వారి నుంచి లీగల్ నోటీస్ వచ్చింది. నిజానికి ఇది కాపీరైట్ చట్టానికి సంబంధించింది కాదు. అయినా వైజయంతీ మూవీస్ అంటే ఉన్న గౌరవం వలన, మేము "శక్తి" కథ గురించి ఊహించి ప్రచురించిన విషయం వలన ఆ కంపెనీకి ఇబ్బంది కలుగుతుందని వారు భావిస్తున్నారని తెలిసి, ఆ కంపెనీ మనోభావాలు దెబ్బతిన కూడదని మేము భావించటం వలన మేము గతంలో ప్రచురించిన విషయాన్ని తీసివేయటమైనది.