English | Telugu

డిస్ట్రిబ్యూటర్స్ 'రభస' చేస్తారట..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రభస' సినిమాకు నిర్మాత బెల్లంకొండ పబ్లిసిటీ సరిగా చేయకపోయినా, ఆ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం రభస చేస్తామని అంటున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ఏంటో చూపిస్తామని అంటున్నారట. యంగ్ టైగర్ సినిమాకి జనాలను రప్పించడానికి పబ్లిసిటీ అవసరంలేదని, గోడపై చిన్న పోస్టర్ పెడితేచాలు రభస.. రభసేనట. దానిని దృష్టిలో పెట్టుకొని పంపిణీదారులు ఈ సినిమాని భారీ సంఖ్యలో రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా చెన్నై వంటి సీటిలో 70స్క్రీన్ లలో ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేశారు. అదే రోజు అక్కడ పవర్ స్టార్ పునీత్ సినిమా రిలీజ్ అవుతున్న, రభసకు అన్ని థియేటర్లు దక్కడం విశేషం. ఈ లెక్కన చూస్తే యంగ్ టైగర్ ఓపెనింగ్స్ తో 'రభస' చేయడం ఖాయమని తెలుస్తోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.