English | Telugu

ఆమెకి విశ్రాంతి దొరికింది..!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ స్టార్ డమ్ ని సంపాదించుకున్న నటీమణులలో 'అనుష్క' ఒకరు. ప్రస్తుతం ఈమె ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతోంది. తెలుగులో బాహుబలి, రుద్రమదేవి వంటి భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న అనుష్క, తమిళ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా, అజిత్ సినిమాలతో గత కొంతకాలంగా విశ్రాంతి లేకుండా బిజీబిజీగా గడుపుతోంది. అయితే చాలా రోజుల తరువాత అనుష్కకి 10 రోజుల విరామం దొరికిందట. దీంతో సినిమా ప్రపంచానికి దూరంగా నచ్చిన ప్రాంతాల్లో స్వేచ్చా విహారానికి రెడీ అవుతోంది. ఎంతయినా అనుష్క కూడా మనిషే కదా? చిత్రాల ఒత్తిడి తట్టుకోవాలంటే.. కాస్త రిలాక్స్ చాలా అవసరం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.