English | Telugu
ఈ నాలుగూ.. నాలుగు విధాలు
Updated : Jan 18, 2016
ఈ సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర నాలుగు సినిమాలు నువ్వా - నేనా అన్నట్టు తలపడ్డాయి. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయనా, ఎక్స్ ప్రెస్ రాజా.. ప్రేక్షకుల తీర్పు కోరుతూ థియేటర్లలో సందడి చేశాయి. చిత్రమేంటంటే.. ఈ నాలుగూ... నాలుగు రకాలైన సినిమాలు. ఏదీ... అసంతృప్తి పరచలేదు. బ్యాడ్ మూవీ అనేదే లేదు! ఈ సంక్రాంతి సీజన్‌ని నాలుగు సినిమాలూ క్యాష్ చేసుకొన్నాయి.
నాన్నకు ప్రేమతో బుధవారమే విడుదల కావడం బాగా కలిసొచ్చింది. 5 రోజులూ వసూళ్లు కుమ్ముకొంది. సుకుమార్ మైండ్ గేమ్ అర్థం కాకపోయినా, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి నచ్చే ఎలిమెంట్స ఏమీ లేకపోయినా.. తొలి 5 రోజుల్లో భారీ వసూళ్లు దక్కాయంటే కారణం.. సంక్రాంతి సీజన్‌లో విడుదల కావడమే. ఎన్టీఆర్ సినిమాకి డివైట్ టాక్ వస్తే.. అసలు వసూళ్లే దక్కేవి కావు. అలాంటిది... నాన్నకు ప్రేమతో అమెరికాలోనూ, నైజాంలోనూ దుమ్ము దులిపేస్తోంది. ఈ రెండు చోట్ల ఇప్పటి వరకూ దాదాపు రూ.14 కోట్లు వసూలు చేసినట్టు టాక్.
ఇక డిక్టేటర్.. 100 శాతం బాలయ్య మార్కు సినిమా. బాలయ్య సినిమా ఎలా ఉంటాయో... ఎలా ఉండాలో అచ్చంగా ఈ సినిమా అలానే ఉంది. దాంతో బాలయ్య ఫ్యాన్స్‌కి వర్కవుట్ అయ్యింది. టికెట్టు రేటు గిట్టుబాటు అయ్యింది. ప్రయోగాలు, ఎగస్ట్రాల జోలికి వెళ్లకుండా.. మాస్‌కి నచ్చేలా ఈ సినిమా రూపొందించాడు శ్రీవాస్. తొలి మూడు రోజుల్లో రూ.15 కోట్లకు పైగానే వసూలు చేసిందీ చిత్రం.
ఇక నాగార్జునకు ఈ సంక్రాంతి బాగానే కలిసొచ్చింది. సంక్రాంతి సీజన్‌కి తగ్గట్టు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ని అందించాడు. దాంతో నాగ్ కి కెరీర్‌లోనే తొలిసారి తన సినిమాకి భారీ వసూళ్లు దక్కాయి. యూఎస్‌లోనూ.. కలెక్షన్లు అదిరాయి. ఇక శర్వానంద్ హ్యాట్రిక్ హీరోగా మారిపోయాడు. ఎక్స్‌ప్రెస్ రాజా.. కామెడీని నమ్ముకొని గట్టెక్కేసింది. భారీ చిత్రాల మధ్య విడుదలైనా... తనకంటూ కొన్ని వసూళ్లు దక్కించుకొంది.